Wednesday, March 15, 2006

పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు

హిపోక్రేట్ల గురించి పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు వ్యాసంలో ఓ చోట - ఎవరైనా యాయావరపు బ్రాహ్మణుడు మీ ఇంటికి యాచనకు వచ్చి "బాయ్, పాట్ లో రైస్ ఏమైనా ఉన్నదేమో, కుడ్ యు కైండ్లీ గెటిట్ హియర్? థాంక్యూ ఇన్ యాంటిసిపేషన్" అన్నచో మీరేమి చేయుదురు? - అని వ్యంగ్యపు బాణం వేసారు. ఆ ప్రశ్న ముట్నూరి వారి రోజుల్లో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రస్తుతం వర్తిస్తుందనుకుంటా. అందులోనూ తెలుగువారి విషయంలో ఇది మరింత బాగా వర్తిస్తుంది. తమ పిల్లలకు ఇంగ్లీషు రాకపోతే భూమ్మీద నూకలు చెల్లినట్లేనని నమ్మే తల్లిదండ్రులున్నంతవరకు, ఇంకా చెప్పాలంటే ఇంగ్లీషు ముక్కలు ఒకటీ అరా నేర్చుకుంటే చాలు, తెలుగులో మాట్లాడడం మాత్రం అవమానంగా భావించే వారున్నంతవరకు ఈ విషయంలో మార్పేమీ ఉండకపోవచ్చు.