Friday, March 17, 2006

మన సంస్కృతి సంప్రదాయాల విలువలు

మన సంస్కృతి సంప్రదాయాల విలువలు, వాటి నేపథ్యాలను జాతికందించిన తెలుగు పౌరాణిక, జానపద చిత్రాలు, నాటకాలు, తోలుబొమ్మలాట, కీలు బొమ్మలాటల శకం దాదాపుగా ముగిసిందనిపిస్తోంది. చక్కని తెలుగు భాషతో కూడిన మధురమైన గీతాల సుమధురాలాపన, భావ వ్యక్తీకరణ ప్రాధాన్యంగా గల రమణీయమైన పద్యాలాపన శైలి, గద్య సంభాషణల ప్రస్ఫుటమైన ఉచ్ఛారణ నేడెక్కడా గోచరించడం లేదు. ఇదే కొనసాగితే ఒక సువర్ణ శకాన్ని మనం చేజేతులారా పక్కన పెట్టినట్లే అవుతుంది. కేవలం నంది నాటకోత్సవాల్లోను, వేళ్ల మీద లెక్కబెట్టే స్థాయిలో ఉన్న పరిషత్తులు నిర్వహించే ఉత్సవాల్లో తప్ప మరెక్కడా పౌరాణిక, జానపద వైభవం మచ్చుకైనా కనిపించడం లేదు. కాగా దూరదర్శన్ కార్యక్రమాలు మాత్రం ఈ కళలను కొంత బతికిస్తున్నాయి. ఈ దిశగా ఏదైనా జరిగితే బాగుంటుంది. మన భావి తరాలకు ఉన్నత సంస్కృతిని పారంపర్యం చేసిన ఆత్మసంతృప్తి మనకు ఎప్పటికీ గర్వకారణమై నిలుస్తుంది. ఈ విషయమై స్పందించండి.

0 Comments:

Post a Comment

<< Home