హలో ..డబ్బు ఎందుకు? ఇందుకు....
మొన్న సోమవారం మాగంటి.ఆర్గ్ వంశీగారితో మాట్లాడుతూ ఉంటే "డబ్బు" గురించి ఒక చిన్న టాపిక్ వచ్చింది. ఆయన వాదనతో నేను ఏకీభవించకపోయినా ఆయన చెప్పినదానిలో కొన్ని పచ్చి నిజాలు ఉన్నాయి అని అనిపించింది.
నా అభిప్రాయం - ప్రస్తుత కాలంలో డబ్బు లేనిదే జీవితం లేదు అని - కానీ ఆయన మాటలు ఇవిగో
"త్యాగా గారు - చాలా మంది సుఖపడటానికి డబ్బు చాలా అవసరం అనుకుంటారు. దానితో నేను విభేదించట్లా. కానీ అది మానసికమయిన సుఖానికి దారి తీస్తుందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెపుతాను.ఎంత డబ్బు ఉండి ఏమి సుఖం అండి.మనిషి మనిషిగా జీవించలేకపోతే, తనకున్న డబ్బుతో సమాజానికి ఉపయోగపడకపోతే అసలు జీవించడం దండగ. ఎక్కడిదాకో ఎందుకు మనకున్న ధనవంతులనే తీసుకోండి - వాళ్ళల్లో ఎంత మంది మన సమాజానికి ఉపయొగపదే పనులు చేస్తున్నారు మీరే చెప్పండి. అదే సమాజానికి సేవ చెయ్యాలి అనే తపన ఉన్నవాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది? వారి వద్ద లేకపోయినా వారు సుఖంగా ఉండి, తమ చుట్టుపక్కల ఉన్నవారి కళ్ళల్లో ఆనందాన్ని చూడట్లా?
మన రాజకీయ నాయకులు, బిజినెస్స్ పీపుల్ని తీసుకుంటే - వేల కోట్లు వాళ్ళ వద్ద మూలుగుతున్నా ఇంకా ఏదో సంపాదించాలి, అని వారు పడే తపన చూస్తే నవ్వు వస్తుంది - అదే తపన కొంచెం సమాజం లోని పేద వారికి ఖర్చు పెడితే ఎందరి జీవితాలు బాగుపడతాయో మీరే ఆలోచించండి. మనమేమీ అప్పు చేసి వాళ్ళ కష్టాలు తీర్చక్ఖరలేదు అండి, మనకున్న దానిలో , మనకు చేతనయినంతలో , మన వద్ద డబ్బు ఉంది కాబట్టి సాయం చేయాలి. లేనప్పుడు ఎలాగూ చెయ్యలేము అని కొద్దిమంది అయినా ఆలొచిస్తే మన దేశం, సమాజం ఎప్పుడో బాగుపడేది"
అని ఒక పెద్ద దీర్ఘమయిన లెక్చర్ ఇచ్చాడాయన.
ఆయన చెప్పిన దానిలో కొన్ని నిజాలు ఉన్నాయి కానీ - ఈ కాలంలో ఆయన చెప్పినవి ఆచరణీయ సాధ్యం కాదు అని నా అభిప్రాయం. ఈ సమాజం అనే చట్రంలో ఎన్నో పనికిమాలిన ఊచలు ఉన్నాయి. అవి అన్నీ ఏరి పారెయ్యాలి అంటే, ఆయన చెప్పిన పనులు చేయాలి అంతే మటుకు సాధ్యం కాదు కాబట్టి - ముక్కు మూసుకుని మన డబ్బు మనం సంపాదించుకుని సుఖపడటం మేలని నా అభిప్రాయం. కొంత మందికి కోపం రావొచ్చు - వీడు ఒట్టి డబ్బు మనిషి అని. కానీ ఏం చేస్తాం. నేను ఎదుర్కున్న సంఘటనలు అలాంటివి మరి. కొంత మందికి ఇలానే డబ్బులు ఇచ్చి చేతులు కాల్చుకున్నాను. అప్పటితో సమాజం లేదు - బొచ్చు లేదు. మన మానాన డబ్బులు సంపాదించుకోవటం, సుఖంగా ఉండటం - ఇదీ నా పరిస్తితి. కొంచెం వయసు వచ్చాక మారతానేమో తెలియదు కానీ...ఇప్పటికి మటుకు ఇంతే.
1 Comments:
INDHULO MEERU CHEPPADALCHUKUNNA NEETHI NAKEAMI NACHCHALEDHU
Post a Comment
<< Home