Friday, December 15, 2006

పుట్టపర్తి వారి శివతాండవములోని అద్భుత పద్యాన్ని చూడండి

పుట్టపర్తి వారి శివతాండవములోని ఇంకొక అద్భుత పద్యాన్ని చూడండి

మొలక మీసపుఁగట్టు, ముద్దుచందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటల రట్టు
సికపై ననల్పకల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతిఁ జెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనలఁ దగులు భృంగ గణంబుఁ
గనుల పండువు సేయ, మనసు నిండుగఁ బూయ
ధణధణధ్వని దిశాతతి బిచ్చలింపంగ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

3 Comments:

At December 15, 2006 7:52 PM, Anonymous Anonymous said...

ఆహా! అసలిది పద్యమనిపించదు, మాట్లాడినట్లుంది. సిరివెన్నెలగారి పాటలుకూడా ఇదే లక్షణం కలిగివుంటాయి. కవిత్వానికి వుండాల్సిన హంగులన్నీ కలిగీ క్లిష్టతలేకుండా సరళంగా. "సికపై " అన్నచోట సిగపై అనిగానీ శిఖపై అనిగానీ వుంటుందనుకొంటున్నాను, నేనేం పాండిత్యమున్నవాణ్ణికాదు, అది సరైనదేనా లేక అచ్చుతప్పా?

 
At December 15, 2006 9:27 PM, Blogger Dr.Pen said...

ఆహా! ఏమి రచనా సౌందర్యం! అందించిన మీకు కృతజ్ఞుణ్ని!

 
At December 16, 2006 2:12 PM, Blogger Bhale Budugu said...

rAnArE gAru

accu tappu kAdu..asalu padyamlO alAnE undi mari

Thyaga

 

Post a Comment

<< Home