చూపులు
చూపులు
రెండు కళ్ళ నుంచి చూపులు
సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై
విచ్చల విడిగా తిరుగుతూ ఉంటై
చూపులెప్పుడూ ముఖం లోకి చూడవు
మాట ఎప్పుడూ మనసు నుంచి పుట్టదు
కనిపించి-నపుడల్ల కంపరం పుట్టేలా
వంటిమీద చూపులు చెదల్లా పాకుతూ ఉంటై
ఆకళ్ళల్లో లక్ష వర్గాలున్నయి
కానీ చూపులకి మాత్రం వర్గ-విభేదాలు లేవు
ఆ చూపుల్లో ఎప్పుడూ ఒక్కటే సంకేతం ఉంటుంది
చొంగ కార్చే కుక్కలాంటి ఆకలుంటుంది
విక్రుతమైన భల్లూకపు పట్టులాంటిదేదో
విడవక కలల్లో సైతం వెంటాడుతూంది
చిక్కని ఈ అడవిలో వెలుగుకీ చీకటికీ
తేడాయే ఉండదు
చూపులనుంచి దాచుకోవటానికి
స్థలమనేదే ఉండదు
రోడ్డు మీద బస్సు-లోను, క్లాసులోనూ
వేసే ప్రతి అదుగు వెనకా, సరీరం లోని ఏదో ఒక భాగాన్ని
గాయం చేస్తూ విషపు-చూపులు గుచ్చుకుంతూనే ఉంటై
ఒక్కోసారి భయమేసి సుదూర ఆకాశంలోకి, శూన్యంలోకి
మాయమై పోవాలంపిస్తుంది
కానీ
పలాయనం పరిష్కారం కాదని
విషపు చూపులనెదుర్కొనే ముళ్ళలాంటి తీక్ష్ణతని
కళ్ళకి నేర్పడం మొదలెట్టాను
ఇప్పుడు ఆకళ్ళని వెంటాడటానికి
కళ్ళతోనే యుద్ధం చేస్తాను
సూటిగా రెండు క్షణాలు కళ్ళలోకి చూడలేని పిరికి చూపులు
పాతాళం లోకి పారి పోతై
అప్పుడనుకుంటాను కళ్ళకే కాదు
ఈదేశం లోని ఆడదానికి
వళ్ళంతా ముళ్ళుండే రోజు ఎప్పుడొస్తుందా అని!
ఎక్కడ చదివానో గుర్తు లేదు కానీ రచయిత్రి పేరు జయప్రభ అని మాత్రం తెలుసు. ఆవిడకి నా జోహార్లు
3 Comments:
"చిక్కని ఈ అడవిలో వెలుగుకీ చీకటికీ
తేడాయే ఉండదు"
"కళ్ళకే కాదు
ఈదేశం లోని ఆడదానికి
వళ్ళంతా ముళ్ళుండే రోజు ఎప్పుడొస్తుందా అని!"
ఈ పాదాలు చాలా బాగున్నాయి.excellent collection! మీ బ్లాగూ బహు బాగు!
త్యాగ గారు,
మీ బ్లాగ్ ఇంతవరకు చూడనే లేదు. చాలా బాగుంది.మీరు డెన్వర్ లో వుంటున్నారా?
ఎక్కడ వుంటారు. ఇప్పటికి నాకు ఒక డెన్వరు బ్లాగరు దొరికాడన్న మాట. నేను కూడ డెన్వర్ లో నే వుంటా. వీలయితే ఒక వుత్తరం ముక్క రాయండి.
విహారి
http://vihaari.blogspot.com
నేను హైదరాబాదులో చదివేరోజుల్లో మా అద్దెగది వెనుక చిన్నగదిలో వుండే తెలుగువిద్యార్ధులతో జరిపే ఇష్టాగోష్ఠిలో ఈ బ్లాగులోని మొదటి కొన్నిపంక్తులు వారు చెప్పగా విన్నాను. తిలక్ అనుకుంటున్నానిన్నాళ్లూ. ఇప్పుడు కాలం మారిందిలెండి. కానీ చూపులు మారలేదు. ఐతే అవే చూపులు ఇప్పుడు న్యూనత స్ధానంలో ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాయి. కారణం - మహిళలు తమ యోగ్యతను, తద్వారా స్ధైర్యాన్ని పెంచుకొన్నారు. ఔనంటారా?
Post a Comment
<< Home