విశ్వదాభిరామ వినవె వయ్యారి
మా ఆవిడ నా గోళ్ళు పెరిగిపోయినాయి అని నిన్న శనివారం నాడు వాల్ మార్ట్ లో కొన్న గోళ్ళ కత్తెరుచ్చుకుని నా వెంబడి పడింది...అప్పుడు జనించిన ఊహ ఈ పద్య రూపం సంతరించుకుంది...
గోళ్ళు పెంచుకొనిన గోకుట సులభంబు
దురద పుట్టునపుడు కరము సుఖము
పిరికివారు గోళ్ళు పీకించుకుందురు
విశ్వదాభిరామ వినవె వయ్యారి జాణ
5 Comments:
గురూజీ, ఇంతకీ ఆ పద్యపు మకుటం ఏ ఛందస్సులో ఇముడుతుంది?
తెలీదు రామనాధ రెడ్డి గారు. నేను ఏదో ఊరకే రాసా ...ఛందస్సు అంటే మరి....కష్టమే
వినవే వయ్యారి భామ అంటే బావుండేదేమో :)
నాకూ పెద్దగా ఏమీ తెలీదుగానీ, ఒక పాట తాళబద్ధంగా నడిచినట్లు పద్యం చదివితే దాని నడక కూడా ఒక పద్ధతిలో ధ్వనిస్తుందికదా. ఆ ధ్వని మీ పద్యంలోని మొదటి పాదాలకు వుంది. చివరిపాదమే కొంత గతి తప్పి ధ్వనిస్తున్నట్లు తెలిస్తూంది. మీరు ప్రయత్నించారు. మీకు కష్టమేమీ కాదండీ. నా బాషలో చెప్పాలంటే -
విశ్వదాభి రామ వినుర వేమ
తన్ననాన నాన తనన నాన
ఈ రెండూ సరిగ్గా ఒకేలా ధ్వనిస్తాయి. ఔనా?
ఆలాగే -
విశ్వదాభి రామ వినుర వేమ
తనననాన నాన తనన నాన - (న్న ను నన గామార్చా)
తన్ననాన ననన తనన నాన
తన్ననాన నాన తాన నాన
తన్ననాన నాన తనన తనన
తనననాన నాన తాన తాన
ఇలా తాళం చెడకుండా అక్షరాలను ఇమడ్చ గలగడమే కదా మీరు చేసింది. మీకిందులో మంచి ఆసక్తి వుంది కాబట్టి మరోటి ప్రయత్నించండి, ఆ తర్వాత పద్యాలు అలా అలవోకగా జారుతాయి మీనోట.
Ramanadha Reddy gArU!
mIru chAlA bAgA viSlEshiMcAraMDi !!!!!!!
www.keshavachary.wordpress.com
Post a Comment
<< Home