నమ్మకాలు, విశ్వాసాలు
కష్టాలూ, సమస్యలూ అందరికీ ఉండేవే. అవి మరి మనషులకు కాక మరెవ్వరికి!!
అటువంటప్పుడు మనస్సు దుర్బలమవడం సహజం. ఆ సమయంలో, ఇటువంటి నమ్మకాలు, విశ్వాసాలు, మనస్సుకు ఒక విధమైన ధైర్యాన్నిస్తాయనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆవిధంగా మనస్సు కుదుట పడితే, మన ఆలోచనా సరళి మెరుగులు దిద్దుకొని సమస్యలు ఇట్టే విడిపోగలవు. ఆరోగ్యనికి సంబంధించినదైతే, సగం రోగం మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుందనడం కూడా అందరికీ తెలిసిందే. అందు వల్ల, ఈ విశ్వాసాలు, నమ్మకాలు, మనకు సహాయంగా ఉన్నంత వరకు మంచిదే. కానీ, ఏదైనా మోతాదును మించకూడదు.
0 Comments:
Post a Comment
<< Home