ఎంతగానో గర్వించదగ్గ దేశాభిమానం - మహామనీషి
బిస్మిల్లాహ్ ఖాన్ గారి గురించి ప్రజాసాహితిలో వచ్చిన పద్యాన్ని కింద ప్రచురించిన తరువాత, నా మనస్సుకి హత్తుకుపోయిన మణిపూస లాంటి ఆయన మాట ఒకటి చెప్పాలి అనిపించింది.అది తలచుకున్నప్పుడల్లా మనసు పులకరించిపోతుందండి నాకు. అంతటి వెల లేని వజ్రాన్ని కన్న తలిదండ్రులు, మన దేశంలో పుట్టినందుకు మనము ఎంతగానో గర్వించదగ్గ విషయం.
ఆయన ఒకసారి విదేశాలలో కచేరీ చేస్తున్నప్పుడు, ఒకాయన ఆయనని అడిగాడు అట "ఏవండీ మీరూ భారతదేశంలో ఎందుకు, చక్కగా ఇక్కడికి వచ్చెయ్యండి. మా దేశంలో ఉండిపోదురు గానీ - మీకు బోలెడన్ని సన్మానాలు, పేరు ప్రఖ్యాతులు తీసుకుని వస్తాము మా దేశం తరఫునుంచి".
అప్పుడు బిస్మిల్లాహ్ ఖాన్ గారు ఏమన్నారో తెలుసా ?
"నాకు ఈ దేశానికి వచ్చి ఉండటానికి అభ్యంతరం లేదు కానీ, ఒక్కటే షరతు..నా తల్లి గంగా నదిని, నా దైవం కాశీ విశ్వనాథుడిని మీ దేశానికి తీసుకుని రండి. అప్పుడు ఆనందంగా వారి సన్నిధిలో మీ దేశంలోనే నా శేష జీవితం గడుపుతాను" అని.
బిస్మిల్లాహ్ ఖాన్ గారిని అలా అడిగిన పెద్దమనిషి మొఖంలో నెత్తురు చుక్క లేదు అని వేరే చెప్పనక్ఖరలేదు అనుకుంటా.
మన దేశం ఎంతగానో గర్వించదగ్గ మహామనీషి బిస్మిల్లాహ్ ఖాన్.
1 Comments:
అంతటి గొప్ప మనిషిని కూడా దూషించిన గొప్పవాల్లు వున్నారు ఈదేశం లో.మొన్నే ఎక్కడో చదివాను ఆయన్ని విమర్సిస్తూ పెద్ద వ్యాసం ప్రచురించారు ఎవరో.
Post a Comment
<< Home