Sunday, January 21, 2007

తెలంగాణపై సత్యసాయిబాబా - కేసీఆర్

తెలంగాణపై సత్యసాయిబాబా చేసిన వ్యాఖ్యలపై తెరాస అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యలు, నేతకార్మికుల ఆకలి కేకలు బాబాకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. ధర్మప్రచారం చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే బాబాలు, జీయర్‌స్వాములకు రాజకీయాలెందుకని వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పల్లెబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం వరంగల్ వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''వారికి కావాల్సినంత పనుంది, లక్షల మంది భక్తులున్నారు. వారి ధర్మ ప్రచార కార్యక్రమాలు చూసుకోక ఇలాంటి వాటిల్లో జోక్యం చేసుకోవటం ఎందుకు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ధర్మ ప్రచారం చేసుకునే వీరు అధర్మ ప్రచారానికి ఎలా వత్తాసు పలుకుతారు. కావాలంటే ఓ యజ్ఞం ఎక్కువగా చేసుకోవాలని గతంలోనే జీయర్‌స్వామికి సూచించాను. అయినా..! తెలంగాణ కావాలని కోరుతున్న తెలంగాణ న్యాయవాదులు, వైద్యులు, ప్రొఫెసర్లు పిచ్చివాళ్లా? వారి మాటకు ఎందుకు విలువ ఇవ్వరు. వీరి డిమాండ్ కాదని బాబాలు, స్వాములను ముందుకు తెచ్చి మాట్లాడించటం సరికాదు'' అని వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మికానికి పరిమితమైతే మంచిది ప్రత్యేక తెలంగాణ గురించి సాయిబాబా మాట్లాడకపోవడమే మంచిది. నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యను ఆయన పరిశీలించి ఉంటే ప్రత్యేక తెలంగాణ అవసరంలేదని అని ఉండేవారు కాదు. ఇలాంటి బాబాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితమైతే మంచిది. - వరంగల్‌లో విలేకరులతో మధుయాష్కీ సత్యసాయిపై 'ధూంధాం' కన్నెర్ర జడ్చర్ల, న్యూస్‌టుడే: ప్రత్యేక తెలంగాణకు సంబంధించి ఆదివారం చెన్నైలో సత్యసాయి బాబా చేసిన వ్యాఖ్యలపై మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆదివారం తెలంగాణ ధూంధాం కార్యక్రమం మండిపడింది. నేతలు నిరసన వ్యక్తం చేశారు. కవులు, కళాకారులు పాటలు పాడి సత్యసాయి వ్యాఖ్యలను గర్హించారు. మాయలు మంత్రాలతో ఇంతకాలం ప్రజలను మోసం చేసిన బాబా అదే విద్యతో తెలంగాణను మోసం చేయాలని చూస్తే సహించేదిలేదని గద్దర్ తీవ్ర స్వరంతో అన్నారు.తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

0 Comments:

Post a Comment

<< Home