Saturday, March 18, 2006

బంధువుల మధ్య అనుబంధాలు

మన సినిమాల్లో స్నేహం విలువలను గురించి తెలిపే చిత్రాలే ఎక్కువగా వచ్చాయి తప్ప, బంధువుల మధ్య అనుబంధాలు కథాంశంగా వచ్చిన సినిమాలు చాలా చాలా తక్కువ. బంధువులచే మోసపోయిన వాళ్లను స్నేహితులు ఆదుకోవడం వంటి కథలున్నాయి గాని, స్నేహితులు మోసం చేస్తే బంధువులు ఆదుకోవడం వంటి ఘటనలు కథలు, సినిమాలూ, నిజ జీవితంలోనూ అరుదే. ఉమ్మడి కుటుంబం, తోటికోడళ్లు వంటి పలు కుటుంబ కథా చిత్రాలను తీసుకుంటే, కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య కీచులాటలతోనే కథలు మొదలై బంధువులంటే ఇంతేనేమో అనే అభిప్రాయాన్ని కల్గిస్తున్నాయి. ఇదే పరిస్థితి నేటి సీరియళ్లదీను. సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ తప్ప నిజ జీవితంలో మాత్రం ఎక్కడా సుఖాంతం కావడం లేదు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య గొడవలు, ఆస్థి తగాదాలు, ప్రతీకారాలు ఇతివృత్తాలుగా తీసిన ఎన్నెన్నో సినిమాలు, సీరియళ్లు (పేర్ల జాబితా రాస్తే అంతుండదు) ప్రజాదరణ పొందుతుండటం కళ్లారా చూస్తున్నాం. వీటికి వాణిజ్య ప్రకటనలు కూడా ఎక్కువే. ఈ ధోరణి మారితే బాగుంటుంది.

2 Comments:

At March 18, 2006 11:03 PM, Blogger kuffir said...

noticed one of your comments on one of my old posts. much appreciate your compliment. i'm trying to download telugu script on my computer.. hasven't succeeded so far. read some of your english posts. good, original thinking. cheers!

 
At March 19, 2006 6:07 PM, Blogger sridhar said...

Interesting observation in your post. Maybe this is a reflection of the current society. It is probably one of the symptoms of our anxious attempts to adopt western culture.We are less dependant and connected to our family members. Sadly this has far reaching effects. As family bonds become weaker, the traditonal channels of knowledge transfer also close down. Those traditions that our grandfather's passed on ro our parents become exticnt with them and dont get passed on to us any more.

Movies you had mentioned were bent on exploring the construct of joint families at a time when they are fast disintegrating.

The fact that these problems are still being explored in our movies and TV serials shows that the directors, writers and actors are insensitive to the existing problems and still holding on to age old onstructs.

 

Post a Comment

<< Home