తెలంగాణా తల్లి - తెలుగు తల్లి
ఈ కే సీ ఆర్ మాటలు వింటూ ఉంటే ఎడ్వాలో నవ్వాలో తెలీడం లేదు. "తెలంగాణా తల్లి - తెలుగు తల్లి కంటే సీనియర్ అట. తెలుగు తల్లిని కుట్రపూరితంగా తెర పైకి తెచ్చారు అట.కిరీటం ఉండాలి అట, హిందు / ముస్లిం / కిరస్తానీ వాళ్ళు అంతా పూజించేటట్టు ఉండాలి అంట. ఈ విగ్రహాలు తయారు చేసి ఊరూరా ప్రతిష్టించాలి అట"
అర్ధం పర్ధం లేని ఈ పిచ్చి వాగుడు ఎంటిరా నాయనో - ఓరి నాయనో -ఈ రాజకీయ జంబూకానికి మతి భ్రమణం అన్నా కలిగి ఉండాలి , లేక పిచ్చి కుక్క అన్నా కరిచి ఉండాలి....ఏకంగా ఒక రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసి , అందులో ఒక ముక్కకి ముఖ్యమంత్రి అయిపోదాము అని ఎంత ఆశరా మగడా... ఎడ్డి గొర్రెల మంద జనాలు , మందు - డబ్బు - క్రికెట్ బాటు పంచిపెట్టగానే - ఓట్లేసి గెలిపించారు...ఇక అడ్డూ ఆపూ లేదు మాటలకి...ఎప్పుడు బాగు పడతారురా నాయనా...
9 Comments:
నాకు తెలిసినంతవరకూ, చదివినంతవరకూ..క్రికెట్ కిట్లు పంచి పెట్టింది..కాంగ్రెస్ వాళ్ళు.....TRS కాదు
అనిల్ చీమలమఱ్ఱి
తల్లి భాష ని గౌరవించడం తెలియని వాడి సంస్కారాన్ని, ముర్ఖత్వాన్ని వాడి ఆలోచనకే వదిలేద్దాం.
వాడి డైలాగులు విని జనం వోట్లు వేశారనుకుంటున్నాడో ఏమిటో.
అనీల్..నీ వ్యాఖ్యలకి ఒక చిన్న సవరణ. పట్టుబడింది కాంగ్రెస్సు అయ్యుండొచ్చు...పట్టుబడని దొంగలు చాలా మందే ఉన్నారు.
ఇందులో వాళ్ళ తప్పేముంది మనమే పిచ్చి వెదవలము. ఇలాంటి వాళ్ళు ఎదో ఉద్దరిస్తారనుకుని ఓటేస్తాము. కాని వాళ్ళు మననే ముంచి మేడలు కట్టేస్తారు. ఓటుని వృదా చేయలేము. ఏం చేయాలి.
వద్దు బాబూ.. ఈ అర్థం పర్థం లేని మాటలు నేణు వినలేను..
ఇచ్చేయండి తెలంగాణాను.. మరిన్ని వింత వాదనలు పొడచూపకముందే!
--ఫ్రసాద్
http://blog.charasala.com
బాబూ కేసీయార్, ముస్లింలు విగ్రహాలకి పూజ చెయ్యరు తమ్మి. చెబితే సంజైతలే..ఓ తలకైమీద నువిచ్చిన బ్యాటు దీస్కోని దబ్బ దబ్బ నాలుగియ్యమంటవానే..గప్పుడన్న లిఫ్టు పైన దాకబోతది.
అన్నా ముందు నీ భాష సరిజేసుకో!
నువ్వు కేసిఆర్ ని మించి పోయినవ్!
ఎక్కడుండి చూస్తున్నవు బాసు..."ఎడ్డి గొర్రెల మంద జనాలు , మందు - డబ్బు - క్రికెట్ బాటు పంచిపెట్టగానే - వీడికి ఓట్లేసి గెలిపించారు.."అంటున్నావ్...
జనాలు ఎవరిదగ్గర డబ్బులు తీసుకున్నా ఓటు వేసింది వెయ్యాలనుకున్నోళ్ళకే.నువ్వొచ్చి చూడు..ఎట్ల గెలిపించిర్రో.....
ఎర్రి జనాలు గిర్రి జనాలు అనకు .
ఓటేసింది తెలంగాణా కోసం. తెలంగాణా అంటే కేసిఆర్ కాదు.
కేశవాచారి గారికి కోటంత కోపం వచ్చి కత్తుచ్చుకుని కసుక్కున కుత్తుక కోసేటట్టు కనపడుతోంది...
బాబోయి ఇంత విప్లవం నేను తట్టుకోలేను కేశవ్ గారు. అయినా నేను అన్న మాటల్లో తప్పు ఏముంది నాయనా ? నాకు తోచింది నేను రాసాను..మీకు ఇష్టం లేకపొతే నా బ్లాగుకు రావొద్దు , చదవొద్దు , ఆ పై నన్ను తిట్టొద్దు.
నేను అక్కడికి వచ్చి చూసినా , ఇక్కడ ఉండి వార్తలు చూసినా పరిస్థితిలో మార్పు మటుకు ఉండదు అని తెలుసు తమ్మీ. నువ్వు నా కన్నా చిన్న వాడివి అని అలా పిలిచాను. మళ్ళీ నన్ను తమ్మీ అంటావా అని ఒక పెద్ద ఉత్తరం వ్రాయొద్దు.
మీ ఊరు మంథని అయితే , మా ఊరు నిర్మల్ బాబూ - అంటే నేను కూడా తెలంగాణా వాడినే..మనలో మనకు పోట్లాట ఎందుకు కానీ...
పైగా నాకు డబ్బులు బొక్క ఒకటి, విమానమెక్కి ఆ దిక్కుమాలిన సంత చూసేందుకు వస్తే.
ఛ ఛ.. నాకు కోపం ఏంటన్నా! కాస్త ఆవేదన....
నువ్వు కరీంనగర్ ఎన్నికని తప్పుగా అంచనా వేసావని అంతే.....
యిక నువ్వు కూడలిలో నుంచొని నా బ్లాగు ఇష్టం లేకుంటే చూడకు అంటే ఎలాగ?....
నేను క్రమం తప్పకుండా నీ రాతలన్నీ చూస్తున్నా....బాగున్నాయి.
Post a Comment
<< Home