తెలుగు పనికిమాలిన భాష అవుతుందా?
మన సంఖ్యతో పోలిస్తే ఎన్నో యూరోపియన్ భాషలు చాలా తక్కువ సంఖ్య మాట్లా డేవారిని కలిగి ఉన్నాయి. కానీ వాటికుండే మర్యాద మనకేదీ? మనల్ని మనమే కించ పరుచుకుంటూ ఉంటే మర్యాద ఎక్కడినుంచి వస్తుంది? భావుకతతో కాకుండా ప్రయోజనాత్మకంగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచిద్దాం.
ఇన్ని కోట్ల మంది ఉండే ఏ దేశంలోనైనా సాహిత్యం చరిత్ర, విజ్ఞానం, పరిపాలన అదే భాషలో ఉంటాయి. నొబెల్ బహుమతి పొందిన వారిలో అధికశాతం ఇంగ్లీషు లో రాసిన వారు కారు. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్, జపనీస్, చైనీస్లాంటి భాషల్లో సాహిత్యం, సంస్కృతి, విజ్ఞానం వ్యక్తమవుతున్నప్పుడు తెలుగు మాత్రం పనికిమాలిన భాష అవుతుందా?
దయచేసి విద్యావంతులంతా ఆలోచించండి. పై భాషల్లో వెలువడిన గొప్ప గ్రంథాలను ఇంగ్లీషులోకి, ఇతర భాషల్లోకి అనువదించు కుంటారు. అంతేకాని వాళ్ళంతా వచ్చీరాని ఇంగ్లీషులోనే రాయాలనుకోరు.
ఈ పైని పదాలు, తెనుగు.ఆర్గ్ నాగరాజ గారు వ్రాసిన వ్యాసం లోనుంచి తీసుకొనటం అయ్యింది.. దానికి నా అభిప్రాయం జత చేశాను...
మనం అలా కాదుగా - ఇతర భాషల్లో ఉన్న దిక్కుమాలినవి మన తెలుగులోకి అనువదించుకుని అహా ఓహో అని అంటాము. మన ఖర్మ అలా తగలడింది మరి.. అది గొప్ప కాదు , ముందు మన భాషని మనం గౌరవిస్తే , ఇతరులకి కూడా దాని విలువ తెలుస్తుంది. ఇంట్లోనే దిక్కు లేదు అంగడికి పోయి ఉన్నవి అన్నీ అమ్ముకున్నట్టు ఉంది మన పరిస్థిథి.. ఈ దౌర్భాగ్యం నుంచి ఎప్పుడు బాగుపడాలని ప్రయత్నిస్తామో అప్పుడే మన మనుగడ బాగుంటుంది .
2 Comments:
మీ ఆవేదన సమంజసం. మన వాళ్ళు తప్పనిసరి ఐతే తప్ప తెలుగు మట్లాడ్డానికి ఇష్టపడట్లేదనిపిస్తుంది.
హైదరబాద్ స్టేషన్ రేడియో వింటే.. అవి తెలుగు కర్యక్రమాలేనా అని సందేహం.
ఇక మన తెలుగు tv యంకర్ల అఘాయిత్యాలు చెప్పవసర్లేదు.
ఇక ఇతర భషల సినిమాల్లో సదరు బషలోనే ఉంతయి మాటలు. కాని మన తెలుగు సినిమాల్లో మసాల హింది, ఇంగ్లిష్ అక్కడక్కడ తెలుగేనా అనిపించే తెలుగు(ముఖ్యం గా హీరొయిన్ మాటలు)
ఇక పుస్తకాల విషయం..
ఇంగ్లీష్ పుస్తకలు చదివామని చెప్పుకోవటం మన ప్రతిష్ట గా భావించబడుతుంది.
తెలుగులో నచ్చినా చెప్పుకోవటానికి ఇష్టపడరు కొందరు.
This comment has been removed by a blog administrator.
Post a Comment
<< Home