చుక్కా కామయ్య - ఒక నిశ్శబ్ద నిశీధి రాత్రి
ఇది కేవలం నవ్వుకోవటానికి వ్రాసినది అని మనవి
ఒక విద్యావేత్త , చుక్కా కామయ్య - ఒక నిశ్శబ్ద నిశీధి రాత్రిలో ఆకాశంలో చుక్కలు లెక్కెట్టుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నాడు -
ఈ దిక్కుమాలిన ఐ ఐ టీ సంకట స్థితి నాకేల రావలె ?
వచ్చినది పో - ఈ ముసలి వయసులో కృష్ణా రామా అనుకోక నేనేల కట కట పడవలె?
కట కట పడితిని పో - రాజుగారు బాసరలో కాక మెదక్ లో స్థాపించవలె అని నిర్ణయించుకొనవలె?
నిర్ణయించితిరి పో - రాజు గారి నిర్ణయముతో నాకేమి సంబంధము అని ఊరకున్న, ఈ నక్క జిత్తుల బు సీ ఆర్ ఊరకుండునా?
నా ముసలి బుర్రని తొలిచి, వినకపోతే కరిచి నా చేత వెధవ మాటలు మాటలాడించక ఊరకుండునా?
వాడు ఊరుకున్నను ఇతర రాజకీయ పందులు నా మీదెక్కి స్వారీ చెయ్యకుండునా?
చేసినవి పో - వాటిని అదిలించి వెడలకొట్టక తాన తందాన అని ఆ పందుల రాజకీయ పీతి వాసనకు నా ముసలి ముక్కు పుటాలు ఏల సంతోషించవలె ?
సంతోషించినవి పో - ఆ ఆనందములో ఈ ఐ ఐ టీ సాధన చరిత్రాత్మకము అని నేనేల ప్రసంగించవలె?
ప్రసంగించితిని పో - ఆవేశం ఎక్కువ అయి ప్రాణాలు బలి పెట్టి అయినా బాసరలో ఐ ఐ టీ సాదించుకుంటాను అని నా నాలుక ఏల నినదించవలె ?
నినదించినది పో - ఇదే అవకాశము అని అందరూ నన్ను ముందుకు తోసి వినోదము ఏల చూడవలె ?
చూసితిరి పో - ఐ ఐ టీ అంటే ఏమిటో కూడా తెలియని చేనేత కార్మికులని, కుమ్మరులని ఆ బు సీ ఆర్ తీసుకుని వచ్చి నిరసన ప్రదర్శన చేయించవలె ?
నిరసన చేసితిరి పో - పోలీసు వారు వారి నడ్డి ఏల విరగ కొట్టవలె ?
విరగ కొట్టితిరి పో - నన్ను కూడా బొక్కలో తోసి అసలు చుక్కలు చూపిస్తాను అని ఏల బెదిరించవలె?
ఆ పై ఈ కార్మికుల శాపనార్ధాలు వేరొకటియా ?
అయ్యో - నా ఉపాధ్యాయ వృత్తిలో నేను సంతోషంగా ఉండక,అనవసరంగా ఈ ఊబి గుంటలో నేనేల చిక్కుకొనవలె ?
చక్కగా చుక్కలు లెక్కెట్టుకుంటూ చుక్కేసుకుని చక్కగా ముసుగు తన్ని చిత్తగించక ఈ ముసలి వయసులో నాకేల ఈ చింత - ఒరేయ్ బు సీ ఆర్, ఇతర రాజకీయ పందుల్లారా మిమ్ములను ఆ సరస్వతీ దేవి తన వీణతో కుప్పలు తెప్పలుగా తన్నులు తన్ని, బడితె పూజ చేయు గాక.
ఇష్షీ - ఇదేమిటి ఆ చంద్రుడు, నా చుక్కలు మబ్బుల చాటుకు వెళ్ళిపోతున్నాయి? అయ్యో - ఎంతటి ప్రారబ్ధము సంభవించినది...
ఇలాంటి గౌరవనీయమయిన ఉపాధ్యాయ వృత్తి కి కళంకం తెచ్చిన నేను మనుటయా - మరణించుటయా ? ఏదీ ?
<< Home