Monday, November 05, 2007

అర్ధం పర్ధం లేని జ్ఞానోదయం

ఈ మధ్య దళిత సాహిత్యం అని, సామాజిక సాహిత్యం అని, పురాతన సాహిత్యం అని, నవీన సాహిత్యం అని, వేదనా సాహిత్యం అని, నా పిండాకూడు సాహిత్యం అని మా సాంబశివరావు గాడు సావగొడుతున్నాడు. అసలు ఆ సోది వాగుడు భరించలేక ఒక రోజు నేను అడిగా వాడిని - ఒరే ఇన్ని రకాల సాహిత్యం అవసరమా అని.దానికి వాడు చెప్పిన సమాధానం ఇది - "ఓరి పిచ్చి వాడా - ఇది కూడా తెలీదురా, నీ....( బూతు మాట వాడాడు) ఎవడికో ఒకడికి ఇంకొకడి మీదో, ఇంకో వర్గం మీదో పీకల దాకా ఉన్న కోపానికి కొన్ని పిచ్చి రాతలు రాసి దానికి ఈ అందమయిన పేర్లు కనుక్కుని మన సాహిత్యాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసారు. పాపం నన్నయ్య, పాల్కురికి సోమనాథుడు ఎప్పుడో పుట్టి, మన మొహాన మంచి రచనలు పడేసి పోయారు. వాళ్ళు కనక ఇప్పుడు పుట్టి ఉంటే - హలో లక్ష్మణా, ఈ సాహిత్యాన్ని రక్షించు భగవంతుడా అని హార్ట్ అట్టాక్ వచ్చి పోయేవాళ్ళు" అని మళ్ళీ ఒక అర్ధం పర్ధం లేని జ్ఞానోదయం చేసాడు నాకు.

ఇక వీడితో మాట్లాడటం దండగ అని పోయి పండుకున్నా.

4 Comments:

At July 30, 2007 5:49 PM, Blogger వికటకవి said...

అదేంటలా అంటారు? మీ ఫ్రెండు చెప్పింది కరక్టే. ఈ పిండాకూడు పర్వంలో మరికొన్ని రకాలు ఏవంటే, రకరకాల "వాదాలు"

ఉదా:
స్త్రీ వాదం, పురుష వాదం, దళిత వాదం, విప్లవ వాదం, గాదిదగుడ్డు వాదం

నేను మాత్రం వీటిని ప్రేమగా స్త్రీ వాతం, దలిట వాతం, విప్లవ వాతం .... అని పిలుస్తాను :-)

 
At July 31, 2007 1:28 PM, Blogger Bhale Budugu said...

లెస్స పలికితిరి. బాగు బాగు ..వాదమును వాతముగా మార్చివేసిన వికటకవీంద్రులకు అభినందనలు.అందుకోండి గండపెండేరం

 
At July 31, 2007 1:29 PM, Blogger Bhale Budugu said...

పనిలో పనిగా మీరు కూడా ఈ వాతాల గురించి ఒక పోష్టు పడెయ్యకూడదూ మీ బ్లాగులో

 
At November 05, 2007 10:34 PM, Blogger Unknown said...

ఔనౌను స్త్రీలను అంగాంగ వర్ణన చేసేదే ఉత్తమ సాహిత్యం! వారి ఆవేదనను, ఆక్రోశాన్నీ వెల్లగక్కేది 'వాత' సాహిత్యం. బహు చక్కగా సెలవిచ్చారు!

 

Post a Comment

<< Home