Tuesday, January 23, 2007

విశాలంధ్ర దేశ కథ - కల్పితము

ఇందులోని వ్యక్తులు గానీ పాత్రలు కానీ ఎవరినీ ఉద్దేశించి రాసినవి కాదు అని మనవి. ఒకవేళ నిజజీవితములో ఎక్కడయినా సామీప్యం కనపడితే అందుకు నా బాధ్యత ఏమీ లేదని , ఇది కేవలం కల్పితముగా వ్రాయబడినది అని సభాముఖంగా విన్నవించుకుంటున్నాను.అనగనగా ఎక్కడో కృష్ణా , గోదావరీ తీరాల మధ్యలో ఉన్న విశాలాంధ్ర దేశాన్ని భూస్వాహా రెడ్డి అనే ఒక గొప్ప రాజు పరిపాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడేవారు. ఎందుకా ? ఆయన రాజ్యం లోని మంత్రులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రజల కష్టార్జితాన్ని విశృంఖలంగా దోచుకుంటూ, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తూ సామాన్య ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేసేవారు. ఈ అమాత్య్వర్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా గొప్ప చరిత్రలు ఉన్నాయి. కాని వారు ఎంత దుర్మార్గులయినా అప్పుడప్పుడు పత్రికల వారితో హాస్యస్ఫోరక సంభాషణలు జరిపేవారు. ఉదాహరణకి ఒక చిన్న సంఘటన చూద్దామా ఇప్పుడు - ప్రచార శాఖా అమాత్యులు బొచ్చె కత్తినారాయణగారు ఉన్నట్టు ఉండి వారి అమాత్య పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్ధపడ్డారు. ఎందుకురా నాయనా అంటే ఆయన గారి తమ్ముడు బొక్కల నరసిమ్హం కి గ్రామ సిమ్హం పదవి ఇవ్వడానికి రాజు గారు అంగీకరించలేదు అని. మరి రాజు గారు ఎందుకు అంగీకరించలేదు? రాజుగారికి తన వంశంలోని వాళ్ళు తప్ప ఇంకెవరి వంశంలోనూ ఇద్దరికి మించి పదవులలో ఉండకూడదు అని ఒక నిశ్చితాభిప్రాయం ఉండేది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకోవాలి. బొచ్చె గారి భార్య లక్ష్మీ బాయి రాజుగారి సేనలోని అశ్వదళానికి సేనాపత్ని. ఈవిడకి ప్రపంచ జ్ఞానం ఏమీ లేకపోయినా, రాజకీయాల గురించి ఏమీ తెలియకపోయినా అమాత్యుల వారి భార్య కావటం వల్ల సేనాపత్ని పదవిలో అలంకరింపచేసారు. అది చూసి బొక్కల నరసిమ్హంకి అంతా అయోమయం అగమ్యగోచరం గా అయిపోయి, అన్నయ్యా, మరి ఏమీ తెలియని వదినకే సేనాపత్ని పదవి కట్టబెట్టావు, మరి నువ్వు చేసే ఇన్ని దుర్మార్గాలలో పాలుపంచుకున్న నాకు యే పదవి ఇప్పించలేవా ? పోనీ పెద్ద పదవులు వద్దు ఒక గ్రామ సిమ్హం పదవి ఇప్పించు.స్వయంగా నేను ప్రజలని కండలూడేలా కరిచి కొరికి వారిని పిండి పిప్పి చేస్తాను. మనము మన వంశం కొన్ని వందల యేళ్ళ దాకా సరిపడే మాంసం(ధనం) సంపాదించి నీ కాళ్ళ వద్ద పడేస్తాను అని వేడుకున్నాడు. ఇక అమాత్యవర్యుల దుర్మార్గపు గుండే కరిగిపోయి రాజు గారి వద్దకి పరిగెత్తి "రాజా - నేను బోగస్ వాగన్ను లో డబ్బులు బొక్కినా, అన్యాయంగా పేదల భూములు బొక్కినా - అంతా ఎవరికోసం చేశాను ? మీ కోసం మీ దేశంకోసం. నేను బొక్కిన ధనలో మీ వాటా మీకు ఇచ్చేసాను కూడా. అలాంటి దుర్మార్గుడిగా నాదొక చిన్న కోరిక. మా తమ్ముడిని తప్పక గ్రామ సిమ్హంగా నియమించమని కోరుతున్నాను. వాడు తప్పక మొరిగి కరిచి మరింత ధనం తీసుకుని వచ్చి మీ పాదాల ముందు పడవేస్తాడు. ఆ మాత్రం నమ్మకం ఉంచండి" అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు రాజు గారు "ఓరోరి బొచ్చె కత్తినారాయాణా - ఎన్ని సారులు చెప్పవలెరా నీకు. మొదటగా నీ దిక్కుమాలిన పత్నిని తీసుకుని వచ్చి సేనాపత్నిగా నియమించమని కోరావు. సరే అని అన్నాను. ఇప్పుడు వచ్చి మీ తమ్ముడికి సిమ్హం పదవి గాడిద గుడ్డు పదవి అంటావు ఏమిరా ?" అని హుంకరించాడు. ఆ హుంకారం విని బొచ్చె గారికి తిక్క రేగి - "ఓరే దుర్మార్గపు రాజా - నీ కోసం నేను నా వంశం కుక్కల లాగా పని చేశి ఒక చిన్న కోరిక కోరితే, అది ఇవ్వడానికి నీ మనసొప్పట్లెదా? అయితే కాచుకో నా రాజీనామా అస్త్రం. ఇది ప్రయోగించాను అంటే భూనభోంతరాలు దద్దరిల్లి పోతాయి. దేశం సర్వ నాశనమయిపోతుంది. నా రాజీనామా వల్ల వచ్చే తీవ్ర తదనంతర పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాలి" అని హెచ్చరించాడు. భూస్వాహా మహారాజుకి ఇలాంటివి అన్ని కొత్త కాదు కాబట్టి, "ప్చ్" అని పెదవి విరిచి హేళణగా ఒక చిరుమందహాసం చిందించి తన పులివెన్ను ఊరినుంచి తెప్పించిన సాలభంజికల సిమ్హాసనం ఎక్కటానికి చక్కా పోయాడు.

తదుపరి సన్నివేశం త్వరలో...

3 Comments:

At January 24, 2007 5:35 AM, Blogger spandana said...

అద్భుతంగా వుంది బొక్కా కత్తినారాయణ కథ. వెధవలకి విన్న వారెవరైనా ఇల్లా గడ్డి పెడతారన్న వెరపు కూడా లేదు. నవ్వితే నాకేటి సిగ్గు అంటూ మొత్తం పదవులన్నీ మాకే కావాలని సిగ్గిడిచి వీధుల కెక్కుతున్నారు. ప్రజల కోసం రాజీనామాలు చేసిన వారున్నారు. తమ తప్పు లేకపోయినా తమదే బాద్యత అని తప్పుకున్న వారున్నారు కానీ, తమ్ముడికి పదవి కావాలి, భార్యకు ఆభరణాం కావాలి అని రాజీనామా చేస్తామంటున్న ఈ స్త్యనారాయణ కుక్కలు ఇప్పుడు ఎక్కువవుతున్నారు. ఛీ! వుమ్మెయ్యాలి వీడి మొహం మీద!
--ప్రసాద్
http://blog.charasala.com

 
At January 24, 2007 5:42 AM, Anonymous Anonymous said...

ప్రజాసేవ చేయాలని నాయకులకు ఎంత కోరికో

 
At January 24, 2007 10:13 AM, Blogger Bhale Budugu said...

ఇది ఇక్కడితో ఆగుంతుంది అని అనుకోను ప్రసాదు గారు. ఒకడు మొదలు పెట్టాడు కదా అని, ప్రతి వాడు నాకు అది కావాలి , నా ....మొరగడం మొదలు పెడతారు. మన దిక్కుమాలిన ప్రజలు అంతకన్నా. కొంచెం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేవాడిని ఎన్నుకోండిరా నాయనా అంటే ఎవడు మనకు మందు పోస్తాడా? ఎవడు మనకు డబ్బులు ఇస్తాడా ? ఎవడు మనలని లారీల్లో ఎక్కించి పట్టణాలకి తీసుకుని వెళ్ళి చూపించి తిండి పెడతాడా అని ఎదురు చూసి, అలా చేసిన వాడికే తమ జీవితాన్ని ప్రభావితం చేసే ఓటుని వాడికి అప్పగిస్తారు. ఇంకేముంది ? రెచ్చిపోయి పీడించుకుని తినటమే...పోనీ గ్రామాల్లోని వారు చదువుకోలేదు, వారికి అర్ధం కాదులే అనుకుంటే, చదువుకున్న వాళ్ళు కూడా అదే తరహా లో పని చేస్తున్నారు. సిగ్గు చేటు అండి. అందరూ కాకపోయినా కొందరయినా రాజకీయాలు అంటే ఉత్సాహం ఉన్న వాళ్ళు, అందులోనూ బాగా చదువుకున్న వాళ్ళు మన రాజకీయాల్లోకి వచ్చి ఏదన్నా బాగు చేద్దాము అని ప్రయత్నిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.

బాబాల నడ్డి విరగకొడతాను అని ఒకడు , నాకు తెలంఘాణా లో బాసరలోనే ఉన్నత విద్యా సంస్థ కావాలి అని ఒకడు, నా తమ్ముడికి ఉద్యోగం ఇవ్వాలి అని ఒకడు, నేను ఇసుక పోసి బారేజులు కడతాను ఆ పని నాకే ఇప్పంచండి అని ఒకడు - ఏమిటండీ ఇదంతా...చెత్త లన్..కొడుకులు చెత్త లోకం...

దూర తీరాల్లో కూర్చుని ఈ మాతలు చెప్పటం బాగానే ఉంటుంది అని మీరు అనవచ్చు, కానీ ఇక్కడ కూర్చుని కూదా నేను పుట్టి పెరిగిని ఊరికి, అక్కడి జనాలకి నాకు తోచిన విధంగా సహాయం చేస్తునే ఉన్నాను - వారికి బోధిస్తూనే ఉన్నాను. మంచి వళ్ళని రాజకీయాల్లోకి తీసుకుని రండి, తేడా మీరే చూస్తారు అని. అలాగే మా గ్రామానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కొంత చైతన్యం వస్తోంది. కొంచెం చదువుకున్న వాళ్ళు గ్రామాధికారాల్లోకి వచ్చి కొన్ని మంచి పనులు చేస్తున్నారు. అలా అన్ని గ్రామాలు బాగుపడితే ఎంతో బాగుంటుంది..ఉదయాన్నే లేచి ఇలాంటి చెత్త బొచ్చె కత్తి నారాయణ గాడి కథలు , మాటలు వినకుండ ఉండొచ్చు

 

Post a Comment

<< Home