Saturday, February 10, 2007

ప్రాస అంటే ఇలా ఉండాలండి...

అనంతభూపాలుడు రచించిన ఒక ప్రాస రచన చూడండి..ప్రాస అంటే ఇలా ఉండాలండి..కృష్ణుడి మీద ఎంత అందంగా రాసారో

కరుణా సముద్రుండు గజరాజ వరదుండు
గర్వితాసుర శిరః ఖండనుండు
విహగేంద్ర వాహుండు విబుధేంద్ర వంద్యుండు
విశ్వరక్షాచణ వీక్షణుండు
రతిరాజ జనకుండు రఘువంశ తిలకుండు
రణ బలోదగ్రుండు రమ్యగుణుడు
గోకులాధీశుండు గోపికారమణుండు
గోవిందు డురుకళా కోవిదుండు

4 Comments:

At February 11, 2007 9:58 AM, Blogger Valluri Sudhakar said...

ప్రాస పద్యం చాలాబాగుంది. కాని, కృష్ణుడి మీద పద్యంలో "రఘువంశ తిలకుండు" (అంటే రాముడని నా అభిప్రాయం) ప్రస్తావన ఏమిటో అర్ధం కాలేదు. వివరించగలరు.

 
At February 11, 2007 4:42 PM, Blogger రానారె said...

విష్ణుమూర్తిని వర్ణించే పద్యం కాబోలు. ఆయన్నైతే రఘువంశజుడనొచ్చు, యాదవుడనొచ్చు, మా'ధవు'డనొచ్చు, ఇంకా ఏమన్నా నప్పుతుంది.

 
At February 12, 2007 12:38 PM, Blogger Bhale Budugu said...

ఇది విష్ణుమూర్తి మీద పద్యమే - ఈ టపాలో చెప్పడం మరిచాను - కృష్ణుల వారి గుణగణాలు వర్ణిస్తూ ఆయన విష్ణుమూర్తి అవతారం అని చెపుతూ వ్రాసిన పద్యం ఇది.. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు రా నా రె గారు

 
At February 12, 2007 1:19 PM, Blogger రానారె said...

నిన్న 'బన్ని' సినిమా చూశాను. అందులోని ఒక పాటలో ప్రాసకోసం రచయిత పడిన ప్రయాస చూసి మీ బ్లాగ్ గుర్తొచ్చింది. వినే వుంటారు --
బన్నిబన్ని బన్నీబన్నీ
నిన్నుచూస్తే జారుతుంది చున్నీ
అన్నీగాదు అందుకోర బన్నీ
అల్లుడెప్పడుడాతావని అడుగుతుంది పిన్ని

ఇలా జుగుప్సాకరంగా సాగుతుంది ఈ పాట.

 

Post a Comment

<< Home