Saturday, June 28, 2008

పెరుగు, మజ్జిగ పదార్ధాలు - పద్యం

కొంత మంది మహానుభావులకి పెరుగు, మజ్జిగ అనే పదార్ధాలు పడవు. వారికొరకు ఒక చిన్న పద్యం రాయాలి అనిపించింది. ఎందుకు రాయాలి అనిపించిందా ? ష్ష్ ష్ష్...మా ఆవిడ కూడా మజ్జిగ, పెరుగు పై యుద్ధం ప్రకటించే వీర నారీమణి. నాకేమో పెరుగు లేకపోతే ఆ పూట భోజనం చేసినట్టు ఉండదు మరి.
సరే ఇక పద్యం లోకి వస్తే

చల్ల కడుపులోన చలువ కలిగించు
వేడి బాధలన్ని వేగిరముగ తగ్గు
రోజు చల్ల వాడితే రోగాలు రావుగా
తెలిసి నడుచుకోవే తెలుగు మగువ

నా పెరుగు బాధలు పడలేక మా ఆవిడ ఒక ఎత్తు వేసింది. ఏమిటి అంటారా ? వివరాలు తదుపరి భాగంలో