Saturday, June 28, 2008

అంపశయ్య మీద తల్లుల్ని పడుకోబెట్టడమేమిటండి అసహ్యంగా?

సార్...ఈ విప్లవ సాహిత్యం ఎక్కడినుంచి రాసారు? మీరే రాసారా ? బాగుంది.....అయినా కుటుంబాలు కలిసి ఉండాలి కానీ, విడిపోతే బాగోదేమోనండి..నేను పుట్టి పెరిగిందంతా ఆదిలాబాదు, కానీ నాకెప్పుడూ తెలంగాణా తల్లి కనపడలేదు, అలాగని తెలుగు తల్లీ కనపడలేదు...ఈ తల్లుల కోసం తపస్సులు చెయ్యాలి..

మరి సమరశంఖాలు, రక్తపుటేరుల రహదారులు, కళేభరాలు, విధూషకులు మాట అడగొద్దు...

ఇక అంపశయ్య మీద తల్లుల్ని పడుకోబెట్టడమేమిటండి అసహ్యంగా, అక్షరాలు ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకు తిరగటమేమిటి, పోరాటాలు రక్తంతో పుట్టటమేమిటి ?...అక్షరాలకు ఎందుకు, ఆ ఆత్మవిశ్వాసమేదో మనకుంటే సరిపోతుందిగా ఈ వెధవ రాజకీయ నాయకులను కుళ్ళబొడవటానికి..

ఆ పొట్టి శ్రీరాములు గారు అచ్చ "తెలుగు వారి" కోసం ఆత్మత్యాగం చేశాడండి..."తెలంగాణా" వారికోసం, "ఆంధ్రా" వారి కోసం, "సీమ" వారి కోసం చెయ్యలేదు...సరే అయినా ఇది మీ పుస్తకం, మీ రాతలు...నేను ఏమి చెప్పేది? ...కోపగించుకోకండి, ముక్కు సూటిగా మాట్లాడినందుకు...నా తీరే అంత...