Tuesday, February 13, 2007

పార్వతి అమ్మవారి "ఉమ" పేరుకి అసలు అర్ధం

చర్ల గణపతి శాస్త్రిగారి కుమార స్వామి విజయము చదువుతుంటే ఒక ఆసక్తికరమయిన విషయం తెలిసింది. పార్వతి అమ్మవారికి "ఉమ" అనే పేరు కూడా ఉంది అని మన అందరికీ తెలిసిందే కదా. ఆ పేరుకి అసలు అర్ధం ఏమిటో తెలుసా ?పర్వత రాజ పుత్రిక కనుక, ఆ వంశా సంబంధాన్ని పురస్కరించుకుని పార్వతి అని పిలిచేవారట ఆవిడని. సరే ఆవిడ భర్త కోసమై తపస్సు చేయడానికి పూనుకోగా తలిదండ్రులు "ఉ = ఓసీ" "మా = తపస్సు వద్దు" అని నిషేధించటానికి చేసిన ప్రయత్నమే ఆవిడకి "ఉమ" అనే నామాన్ని సార్ధకం చేసింది అట.

చాల ఆసక్తికరంగా ఉంది

3 Comments:

At February 13, 2007 4:42 PM, Blogger రాధిక said...

nijamea...చాల ఆసక్తికరంగా ఉంది

 
At February 14, 2007 6:41 AM, Blogger Suresh Kolichala said...

ఈ రకమైన వ్యుత్పత్యర్థాలు చెప్పడంలో మన సంస్కృత పండితులు ఒక రకమైన ఆనందం పొందేవారనిపిస్తుంది. పుత్ర అన్న పదానికి "పున్నామాత్ త్రాయతే ఇతి పుత్రః (పున్నామ నరకంనుండి రక్షించే వాడు పుత్రుడు)" అన్న వ్యుత్పత్యర్థం చెప్పడం లోనూ ఈ విధమైన జానపద వ్యుత్పత్తే కనిపిస్తుంది. -త్ర, -tro అన్న ధాతువులు ఇండో-యూరోపియన్ భాషలలో సర్వ సాధారణం. మిత్ర, పాత్ర, సూత్ర, హోత్ర అన్న పదాలు పైన చెప్పిన వ్యుత్పత్తికి లొంగవు. భైరవ అన్న పదానికి భీ + రు + వం అని చెప్పడం కూడా ఈ రకమైన folk etymologyకి ఉదాహరణ. ఉమా, గంగా వంటి చిన్న చిన్న పదాలకు వ్యుత్పత్తి చెప్పడం చాలా క్లిష్టమైన పని.

 
At August 19, 2020 2:55 AM, Blogger yanmaneee said...

kyrie 4
kd 11
balenciaga shoes
nike shox
supreme t shirt
supreme clothing
nike shox for men
golden goose sneakers
curry 7
balenciaga

 

Post a Comment

<< Home