Tuesday, February 20, 2007

ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం గారి "రసాశ్రువు"

ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం గారి గ్రంథము "రసాశ్రువు" లోని ఇష్ట దేవతా ప్రార్థనము లోని కొన్ని పద్యాలు. ఆహా...

శా.

వీణా పుస్తకరమ్య పాణి,కవితా విన్యాస విస్తారిణీ
వేణీబంభర జృంభితాస్యరమణీ,వేదార్థ విశ్లేషిణీ
వాణీ,నాద సుధామణీ,గుణమణీ,పాండిత్య సంధాయినీ
ప్రాణాయామ విశేషిణీ,నిరత దివ్య జ్ఞాన సంతోషిణీ.

కం.

వరవీణా మృదుపాణిని
సురుచిర సారంగ వేణి శోభిత వక్త్రన్
సరిగమ పదనిస రసధుని
వరరుచి కవితా మధురిమ పదనటమూర్తిన్.

కం.

కొలుతును సతతము జిలిబిలి
తెలుగుల పలుకుల లలనను త్రికరణ శుద్ధిన్,
మలతును చదువుల బ్రతుకును
విలసిత మృదు మధుర కవన విశృతికొరకై.

0 Comments:

Post a Comment

<< Home