వ్యవసాయ పారిభాషిక పదాలు
మొన్న వంశీగారిని కలిసినప్పుడు మాటల మధ్యలో , మన ఆంధ్ర దేశంలోని వ్యవసాయానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చకు వచ్చాయి. ఆయన ఒక మాట అన్నాడు. "త్యాగ గారు - నాకు వ్యవసాయ పారిభాషిక పదాలు కూర్పు చేయ్యాలి అని ఆసక్తిగా ఉంది కానీ, వాటికి సంబంధించి వివరాలు దొరకటంలేదు - మీకు పొలాలు గట్రా అవీ ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి - సాయం ఏమన్నా చేయగలరా అని అడిగారు.సరే అని ఈ వారం ఆ పని మొదలుపెట్టి కొన్ని పదాలు వ్రాసా.. వచ్చే వారం మరి కొన్ని, ఆ పై వారం మరి కొన్ని - అలా మొత్తానికి ఆయన కూర్పుకి సాయపడదాము అని నిశ్చయించుకున్నాను. అలా మొదలు పెట్టిన ప్రయత్నమే ఈ కింది పదాలు
అంచె - బఱ్ఱెలకు దాణా పెట్టే బుట్ట
అటుకు / అలవ - బఱ్ఱెల కొట్టంలో దాణా, పొట్టు అవీ పెట్టుకోవటానికి ఏర్పరచిన చోటు
ఇలారం - గుండ్రంగా వేసిన గొడ్ల కొట్టం, గుత్తాపుశాల
ఊల దంటు - తియ్యగా ఉండని జొన్న దంటు
కంకర - గింజ పట్టని కంకి
కట్టుగొయ్య / కట్టుగోరు - బఱ్ఱెలని కట్టెయ్యటానికి పాతే కఱ్ఱ
కడుగు / కుడితి - పశువులకి ఆహారంగా పెట్టే నీళ్ళు
కసువు / గడ్డి - పశువులకు ఆహారంగా వేసే మొక్కలు, ఆకులు, కాడలు
కూగు / బొత్తు - జొన్నలు, రాగులు మొదలయినవాటి గింజలకి అంటుకుని ఉండే పొట్టు
కొంకి - కొట్టంలో తాళ్ళకట్ట తగిలించే వంకర కఱ్ఱ
కొరట - రాగిగింజలు కొట్టిన పిండి వేసి కాచిన నీళ్ళు
కొట్టం - సాల, సావిడిగగ్గి - గింజలు రాల్చిన కంకి
గంజు - పశువుల మూత్రం
ఇంకా గటక చొప్ప, చెంగలి, జీలిగి, జెరుపోతు, చిరిచేమాకు, గునుగు, జీలిగి, తక్కెల, తుంగ, దర్భ, పిల్లిపెసర, నక్కిరి గడ్డి, పుటపుటాలు, బల్లి గడ్డి, రాగిస గడ్డి, గొత్తు, గాటికంబం, గాటిగుంజ, గోలెం, చిట్టు, చితుకు, చొప్ప, గొత్తు, గోణాం, గుగ్గిళ్ళు, తట్ట, జాడు, జల్ల, జబ్బ, తవుడు ఇలా ఎన్నో రకాల పదాలు ఉన్నాయి.
1 Comments:
మాస్టారూ,
పనిలో పనిగా వీటిని మన తెవికీ లో పెట్టెయ్యక పోయారూ?
విహారి
Post a Comment
<< Home