Monday, April 09, 2007

దేవాదాయం కాదు దేవదాయ....

దేవాదాయం కాదు దేవదాయ - ఉదాహరణకి దేవాదాయ శాఖ కాదు - అది దేవదాయ శాఖ అని రాళ్ళబండి కవితా ప్రసాద వారి మరో వ్యాఖ్యానం - భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా.

అదే విధంగా కల్యాణం కాదు - కళ్యాణమే సరి అయిన పదం అని మరో వివరణ.

భాషా దోషాలే వీరతాళ్ళుగా వెలుగుతున్న రోజుల్లో ఇలాంటి కనువిప్పు కలిగించే మాటలు అందరికీ అవసరం అని నా అభిప్రాయం.


రాత కోతల్లో ఒకో సారి భాషాదోషాలు దొర్లవచ్చు, కానీ అవే సరి అయినవి అని మనసులో అభిప్రాయం ఏర్పరుచుకొని, ఇతరులు చెప్పేదేమిటి మనకు అని కొంత మంది వ్యవహరించడం ఈ మధ్య నేను గమనించడం జరిగింది. అందువల్ల ఈ రాతలు రాయవలసి వస్తోంది.

2 Comments:

At April 08, 2007 11:21 AM, Blogger చదువరి said...

కల్యాణం / కళ్యాణం కాస్త తికమకగా ఉందండి. ఇదే పదం విషయమై ఒరెమూనాలో చిన్న చర్చ జరిగింది. కళ్యాణమే సరైనదని నేను అనుకునే వాణ్ణి, బూదరాజు రాధాకృష్ణ గారి పుస్తకం చదివే దాకా. ఆయన 'కల్యాణమే' సరైనదని రాసారు. రాళ్ళబండి వారు 'కళ్యాణం' సరైనదని అంటున్నారు. ఏది సరైనదో ఏది కాదో!?

 
At April 08, 2007 4:37 PM, Blogger రానారె said...

దేవదాయము అనే పదానికి వ్యుత్పత్యర్థం ఏమిటి? బుడుగుగారూ రాళ్లబండివారేమైనా చెప్పారా?

 

Post a Comment

<< Home