నోరు వెళ్ళబెట్టుకుని !!!
మా ఊర్లో రాం నివాస్ శాస్త్రి అని ఒక తెలుగు పండితుడు ఉండేవారు. ఆయన ప్రభుత్వ పాఠశాలలో పని చేసేవాడు.పిల్లలకి పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు అని పెద్దలంతా ఒక రోజు కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెపితే ఆయన ఏమన్నాడో తెలుసా ?
"ఏవండీ విద్యార్ధికి ఆసక్తి ఉంటే వాడు కష్టపడి స్వయంగా పుస్తకాలు చదువుకుని అర్ధం చేసుకుని పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతాడు అండి. ఉపాధ్యాయుడు చెప్పవలసిన పని లేదు. ఇక విద్యార్ధికి ఆసక్తి లేకపోతే ఉపాధ్యాయుడు చెప్పినా వాళ్ళ బుర్రకి ఎక్కదు. ఇక మీరే చెప్పండి - నేను ఇంకా పాఠాలు చెప్పాలా?"
ప్రధానోపాధ్యాయుడితో సహా అందరూ నోరు వెళ్ళబెట్టుకుని చూశారట
ఈ మాట ఇప్పటికీ మా ఊర్లో చెప్పుకుంటూ ఉంటారు.
1 Comments:
బాగున్నాయి మీ టపాలు...
Post a Comment
<< Home