Monday, April 09, 2007

తెలుగు నుడికారాలు??

సామాన్యంగా విడివిడిగా పొడిమాటలుగా ఉన్నవే అపూర్వసమ్మేళనంతో - ఆ మాటలకు విడివిడిగా వేనికీ లేని ఏదో ఒక అపూర్వభావవ్యక్తీకరణకు మూలాలై - విశిష్ట పదబంధాలుగా మన అజరామర తెలుగు భాషలో నిలిచిపోతున్న పదాలనే నుడికారాలు, పలుకుబడులు, జాతీయములు అని పేర్కొంటూ ఉంటాము. ఇవే కవితాలతాంకుర ప్రథమాలవాలాలని పెద్దలు చెపుతారు.


ఉదాహరణకి "కళ్ళలో కారం పోసుకోవటం" అన్న పలుకుబడిని తీసుకుంటే ఇందులో మూడు రకాల పదాలు ఉన్నాయి. కళ్ళు, కారం, పోసుకోవటం.ఈ పై వాక్యాన్ని అచ్చు అలాగే మరొక భాషలో యే పదానికి ఆ పదానికి ఉన్న అర్ధమూ, వాక్యంలో కారకం అవీ చూసి వ్యాకరణ యుక్తంగా అర్ధం చెప్పి, అలాగే అనువదిస్తే ఆ నిర్దిష్టమయిన భావం చస్తే రాదు. అందుకనే దీన్ని నుడికారము అంటారు. తెలుగులో ఉన్న నుడులలో ఏదో హాయిని గొలిపే విశిష్టపదబంధ వైచిత్రి ఉంది. అదండీ మన భాష గొప్పతనం

2 Comments:

At April 09, 2007 8:48 AM, Blogger రాధిక said...

ఈ నుడికారం గురించే రానారే పొద్దులో రాసారు చూడండి.నుడి కారం మీద మమకారం లేని తెలుగోడు వుండడేమొ?ఎప్పుడెప్పుడు నుడికారాలు వాడుదామా అని చూసి ఎదో ఒక సందర్భం లో ఏదో ఒక రూపం లో వాడుతూనే వుంటాము.

 
At November 10, 2019 8:26 AM, Blogger Unknown said...

మదిని దోచే నుడికారాలు వాడి కథ రాయాలి ?

 

Post a Comment

<< Home