అర్ధం పర్ధం లేని జ్ఞానోదయం
ఈ మధ్య దళిత సాహిత్యం అని, సామాజిక సాహిత్యం అని, పురాతన సాహిత్యం అని, నవీన సాహిత్యం అని, వేదనా సాహిత్యం అని, నా పిండాకూడు సాహిత్యం అని మా సాంబశివరావు గాడు సావగొడుతున్నాడు. అసలు ఆ సోది వాగుడు భరించలేక ఒక రోజు నేను అడిగా వాడిని - ఒరే ఇన్ని రకాల సాహిత్యం అవసరమా అని.దానికి వాడు చెప్పిన సమాధానం ఇది - "ఓరి పిచ్చి వాడా - ఇది కూడా తెలీదురా, నీ....( బూతు మాట వాడాడు) ఎవడికో ఒకడికి ఇంకొకడి మీదో, ఇంకో వర్గం మీదో పీకల దాకా ఉన్న కోపానికి కొన్ని పిచ్చి రాతలు రాసి దానికి ఈ అందమయిన పేర్లు కనుక్కుని మన సాహిత్యాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసారు. పాపం నన్నయ్య, పాల్కురికి సోమనాథుడు ఎప్పుడో పుట్టి, మన మొహాన మంచి రచనలు పడేసి పోయారు. వాళ్ళు కనక ఇప్పుడు పుట్టి ఉంటే - హలో లక్ష్మణా, ఈ సాహిత్యాన్ని రక్షించు భగవంతుడా అని హార్ట్ అట్టాక్ వచ్చి పోయేవాళ్ళు" అని మళ్ళీ ఒక అర్ధం పర్ధం లేని జ్ఞానోదయం చేసాడు నాకు.
ఇక వీడితో మాట్లాడటం దండగ అని పోయి పండుకున్నా.