Tuesday, July 01, 2008

నాకు గిర గిర గిరికీ ఉరికీ , దూచి దుంకీ అయ్యింది!

ఈ మధ్య రాయటం అలవాటు పోవటం వల్లో ఏమో కాని, మళ్ళీ మొదలుపెట్టేటప్పటికి ఇప్పటి జనాల రాతల్లో చాలా మార్పులు కనపడుతున్నాయి.మా సాంబు గాడిని కదిల్చా...ఏరా సాంబా, దీనికి కారణం ఏమయి ఉంటుంది అని - వాడు తీవ్రమయిన దయ్యం చూపు ఒకటి చూసి, "ఒరే పక్షీ మార్పు అనేది అసహజం, కూర్పు (ఎత్తి రాయడం) అయితే సహజం ..ఇది కూడా తెలీదురా నీ ________ అన్నాడు(అని ఒక బూతు మాట!)"...నాకు గిర గిర గిరికీ ఉరికీ , దూచి దుంకీ అయ్యింది....ఆ దూచి దుంకి ఏమిటో వచ్చే టపాలో

త్యాగ

Saturday, June 28, 2008

తెనుగు వృద్ధుల్ , తెనుగు వృద్ధ బాంధవులనేకుల్

ఇదివరకొకసారి ఈ టపా రాసాను..కానీ మళ్ళీ రాయాలి అనిపించింది..





రాత్రి అన్నగారు దుశ్శాసనుడి మీద ఆగ్రహం అభినయిస్తూ పాడిన పద్యం విని ఇలా రాయాలి అనిపించింది...ఘంటశాల గారి మధుర స్వరాల గాత్ర లో ఒక చిన్ని ఆణిముత్యం ఇది..ఆయనకు ఇదే నా హృదయ పూర్వక నమఃస్సుమాంజలి





తెనుగు వృద్ధుల్ , తెనుగు వృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండ
మదోథ్థురులయి మాతృభాషని మరచిన దుశ్శాసనులన్
లోక భీకర లీలన్ వధియించి తత్ రిపుల వక్షశ్శైల రక్తౌఖనిర్ఝర
సకల జనావళి చూచుచుండ అనినాశ్వాదింతున్ ఉగ్రాకృతిన్




అసలు అన్న గారి రూపం చూడండి ...ప్రపంచంలో మన తెలుగు వారి కన్నా భాగ్యవంతులు ఉన్నారా అనిపించే అత్యంత సుందర సుమనోహర రూప గాంభీర్యం , ఆ గాంభీర్యంలోనే ఎంత లాలసత్వం ...నాకైతే ఆయనని చూస్తేనే హృదయం ఉప్పొంగిపోతుంది..

అంపశయ్య మీద తల్లుల్ని పడుకోబెట్టడమేమిటండి అసహ్యంగా?

సార్...ఈ విప్లవ సాహిత్యం ఎక్కడినుంచి రాసారు? మీరే రాసారా ? బాగుంది.....అయినా కుటుంబాలు కలిసి ఉండాలి కానీ, విడిపోతే బాగోదేమోనండి..నేను పుట్టి పెరిగిందంతా ఆదిలాబాదు, కానీ నాకెప్పుడూ తెలంగాణా తల్లి కనపడలేదు, అలాగని తెలుగు తల్లీ కనపడలేదు...ఈ తల్లుల కోసం తపస్సులు చెయ్యాలి..

మరి సమరశంఖాలు, రక్తపుటేరుల రహదారులు, కళేభరాలు, విధూషకులు మాట అడగొద్దు...

ఇక అంపశయ్య మీద తల్లుల్ని పడుకోబెట్టడమేమిటండి అసహ్యంగా, అక్షరాలు ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకు తిరగటమేమిటి, పోరాటాలు రక్తంతో పుట్టటమేమిటి ?...అక్షరాలకు ఎందుకు, ఆ ఆత్మవిశ్వాసమేదో మనకుంటే సరిపోతుందిగా ఈ వెధవ రాజకీయ నాయకులను కుళ్ళబొడవటానికి..

ఆ పొట్టి శ్రీరాములు గారు అచ్చ "తెలుగు వారి" కోసం ఆత్మత్యాగం చేశాడండి..."తెలంగాణా" వారికోసం, "ఆంధ్రా" వారి కోసం, "సీమ" వారి కోసం చెయ్యలేదు...సరే అయినా ఇది మీ పుస్తకం, మీ రాతలు...నేను ఏమి చెప్పేది? ...కోపగించుకోకండి, ముక్కు సూటిగా మాట్లాడినందుకు...నా తీరే అంత...

పెరుగు, మజ్జిగ పదార్ధాలు - పద్యం

కొంత మంది మహానుభావులకి పెరుగు, మజ్జిగ అనే పదార్ధాలు పడవు. వారికొరకు ఒక చిన్న పద్యం రాయాలి అనిపించింది. ఎందుకు రాయాలి అనిపించిందా ? ష్ష్ ష్ష్...మా ఆవిడ కూడా మజ్జిగ, పెరుగు పై యుద్ధం ప్రకటించే వీర నారీమణి. నాకేమో పెరుగు లేకపోతే ఆ పూట భోజనం చేసినట్టు ఉండదు మరి.
సరే ఇక పద్యం లోకి వస్తే

చల్ల కడుపులోన చలువ కలిగించు
వేడి బాధలన్ని వేగిరముగ తగ్గు
రోజు చల్ల వాడితే రోగాలు రావుగా
తెలిసి నడుచుకోవే తెలుగు మగువ

నా పెరుగు బాధలు పడలేక మా ఆవిడ ఒక ఎత్తు వేసింది. ఏమిటి అంటారా ? వివరాలు తదుపరి భాగంలో

చుక్కా కామయ్య - ఒక నిశ్శబ్ద నిశీధి రాత్రి

ఇది కేవలం నవ్వుకోవటానికి వ్రాసినది అని మనవి

ఒక విద్యావేత్త , చుక్కా కామయ్య - ఒక నిశ్శబ్ద నిశీధి రాత్రిలో ఆకాశంలో చుక్కలు లెక్కెట్టుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నాడు -

ఈ దిక్కుమాలిన ఐ ఐ టీ సంకట స్థితి నాకేల రావలె ?

వచ్చినది పో - ఈ ముసలి వయసులో కృష్ణా రామా అనుకోక నేనేల కట కట పడవలె?

కట కట పడితిని పో - రాజుగారు బాసరలో కాక మెదక్ లో స్థాపించవలె అని నిర్ణయించుకొనవలె?

నిర్ణయించితిరి పో - రాజు గారి నిర్ణయముతో నాకేమి సంబంధము అని ఊరకున్న, ఈ నక్క జిత్తుల బు సీ ఆర్ ఊరకుండునా?

నా ముసలి బుర్రని తొలిచి, వినకపోతే కరిచి నా చేత వెధవ మాటలు మాటలాడించక ఊరకుండునా?

వాడు ఊరుకున్నను ఇతర రాజకీయ పందులు నా మీదెక్కి స్వారీ చెయ్యకుండునా?

చేసినవి పో - వాటిని అదిలించి వెడలకొట్టక తాన తందాన అని ఆ పందుల రాజకీయ పీతి వాసనకు నా ముసలి ముక్కు పుటాలు ఏల సంతోషించవలె ?

సంతోషించినవి పో - ఆ ఆనందములో ఈ ఐ ఐ టీ సాధన చరిత్రాత్మకము అని నేనేల ప్రసంగించవలె?

ప్రసంగించితిని పో - ఆవేశం ఎక్కువ అయి ప్రాణాలు బలి పెట్టి అయినా బాసరలో ఐ ఐ టీ సాదించుకుంటాను అని నా నాలుక ఏల నినదించవలె ?

నినదించినది పో - ఇదే అవకాశము అని అందరూ నన్ను ముందుకు తోసి వినోదము ఏల చూడవలె ?

చూసితిరి పో - ఐ ఐ టీ అంటే ఏమిటో కూడా తెలియని చేనేత కార్మికులని, కుమ్మరులని ఆ బు సీ ఆర్ తీసుకుని వచ్చి నిరసన ప్రదర్శన చేయించవలె ?

నిరసన చేసితిరి పో - పోలీసు వారు వారి నడ్డి ఏల విరగ కొట్టవలె ?

విరగ కొట్టితిరి పో - నన్ను కూడా బొక్కలో తోసి అసలు చుక్కలు చూపిస్తాను అని ఏల బెదిరించవలె?

ఆ పై ఈ కార్మికుల శాపనార్ధాలు వేరొకటియా ?

అయ్యో - నా ఉపాధ్యాయ వృత్తిలో నేను సంతోషంగా ఉండక,అనవసరంగా ఈ ఊబి గుంటలో నేనేల చిక్కుకొనవలె ?

చక్కగా చుక్కలు లెక్కెట్టుకుంటూ చుక్కేసుకుని చక్కగా ముసుగు తన్ని చిత్తగించక ఈ ముసలి వయసులో నాకేల ఈ చింత - ఒరేయ్ బు సీ ఆర్, ఇతర రాజకీయ పందుల్లారా మిమ్ములను ఆ సరస్వతీ దేవి తన వీణతో కుప్పలు తెప్పలుగా తన్నులు తన్ని, బడితె పూజ చేయు గాక.


ఇష్షీ - ఇదేమిటి ఆ చంద్రుడు, నా చుక్కలు మబ్బుల చాటుకు వెళ్ళిపోతున్నాయి? అయ్యో - ఎంతటి ప్రారబ్ధము సంభవించినది...

ఇలాంటి గౌరవనీయమయిన ఉపాధ్యాయ వృత్తి కి కళంకం తెచ్చిన నేను మనుటయా - మరణించుటయా ? ఏదీ ?