Wednesday, November 29, 2006

400 ఏళ్లనాడే భారత్లో నానోటెక్నాలజీ!

మతయుద్ధాల్లో కత్తులకు భారత్ నుంచే ఇనుము

400 ఏళ్లనాడే నానోటెక్నాలజీ!

హాంబర్గ్: శతాబ్దాల కిందట క్రైస్తవ రాజులపై ముస్లిమ్‌లు సాగించిన మత యుద్ధాల్లో వాడిన కత్తుల కోసం ఇనుమును భారత్ నుంచి తీసుకొచ్చారని జర్మనీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందులో ఓ రకమైన నానో టెక్నాలజీని వినియోగించారని వారు పేర్కొన్నారు. ఈ కత్తులు అత్యంత పదును కలిగి ఉంటాయి. పురాతన కాలంలో భారత్‌లో వాడే వూజ్ అనే ఇనుప ముద్దల ద్వారా వీటిని తయారుచేసినట్లు చెప్పారు. అత్యాధునిక పద్ధతుల్లో ముడి ఇనుమును శుద్ధి చేసి దీన్ని రూపొందించారని జర్మన్ పరిశోధకులు వివరించారు. అయితే ఈ ప్రక్రియ తాలుకు రహస్యాలు 18 శతాబ్దంలోనే గల్లంతయ్యాయి. యూరప్‌కు చెందిన నిపుణులు ఇప్పుడు వీటిని తిరిగి తయారుచేయలేకపోతున్నారు. అప్పట్లోనే కంసాలీలు ఇంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కడంలేదు. ఇందుకోసం వారు పరిశోధనలు జరుపుతున్నారు. 17వ శతాబ్దం నాటి ఒక కత్తిని పరిశీలించిన శాస్త్రవేత్తలు కార్బన్ నానో ట్యూబ్‌ల ఆచూకీని పసిగట్టారు. అంటే నాలుగొందల ఏళ్ల కిందటే నానో టెక్నాలజీ అప్పటి చేతివృత్తుల వారి అందుబాటులో ఉందని డ్రెస్డెన్ విశ్వవిద్యాలయానికి చెందిన పీటర్ పాఫ్లర్ చెప్పారు.


Courtesy: EENADU

Monday, November 27, 2006

దీని భావమేమి తిరుమలేశా ?

కుతిక నలుపుగాని శితికంధరుడుగాడు
పాముకాదు, నెమలి పక్షి కాదు
గంతులిడుచు, నడచుగాని కప్పయుగాదు
దీని భావమేమి తిరుమలేశా ?

సమాధానం : ఊరపిచ్చుక

Wednesday, November 22, 2006

300GB Holographic CD’s will be available this week

300GB Holographic CD’s will be available this week
November 18th, 2006



There was a rumor for some time now, that a large capacity disc will be developed, but nothing on-topic has proven so yet. Now, Hitachi-Maxell is planning to organize a showcase this week, and present to the open public their new 300GB holographic CD’s. It does seem like this is Science-Fiction, but I can assure you it’s not.

We are all asking ourselves what would be the advantages and disadvantages of this removable media. Within advantages, I could mention the transfer rate of 20MB/s, the high capacity and the multitude of operations that could be fulfilled with the help of it, like large amounts of backups, uncompressed media (movies and audio) that could be easily edited later, and many many more.

Disadvantages? The price, of course. It’s expected that one holographic disc will cost somewhere between $100 and $125, and the optical drive that will be able to operate them will go up to $15.000! And wait, there’s more for the future. In 2008, InPhase plans a second-generation 800GB rewritable optical disc with data transfer rates of about 80MBbps, with plans to expand its capacity to 1.6TB by 2010.



This great news article can be seen at

http://www.our-picks.com/archives/2006/11/18/300gb-holographic-cds-will-be-available-this-week/

Saturday, November 18, 2006

నేనొక ప్రేమ పిపాసిని

చిత్రం : ఇంద్రధనస్సు
బాలసుబ్రహ్మణ్యం,ఆచార్య ఆత్రేయ,కె.వి.మహదేవన్

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది.
నేనొక ప్రేమ పిపాసిని

తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది.
నేనొక ప్రేమ పిపాసిని

పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచానని తెలిపేలోగా నివురై పోతాను
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది.
నేనొక ప్రేమ పిపాసిని

Thursday, November 16, 2006

ఒక మంచి ప్రయత్నం.

ఒక మంచి ప్రయత్నం. ఇలాంటిది మన దేశంలో కూడా ఉంటే బాగుండు. ఎంతో మంది నిజమయిన పేదవారికి , నిజంగా అవసరమయినవారికి సహాయపడవచ్చు


ఒక మంచి ప్రయత్నం.

Wednesday, November 15, 2006

చూపులు

చూపులు

రెండు కళ్ళ నుంచి చూపులు
సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై
విచ్చల విడిగా తిరుగుతూ ఉంటై

చూపులెప్పుడూ ముఖం లోకి చూడవు
మాట ఎప్పుడూ మనసు నుంచి పుట్టదు
కనిపించి-నపుడల్ల కంపరం పుట్టేలా
వంటిమీద చూపులు చెదల్లా పాకుతూ ఉంటై

ఆకళ్ళల్లో లక్ష వర్గాలున్నయి
కానీ చూపులకి మాత్రం వర్గ-విభేదాలు లేవు

ఆ చూపుల్లో ఎప్పుడూ ఒక్కటే సంకేతం ఉంటుంది
చొంగ కార్చే కుక్కలాంటి ఆకలుంటుంది
విక్రుతమైన భల్లూకపు పట్టులాంటిదేదో
విడవక కలల్లో సైతం వెంటాడుతూంది
చిక్కని ఈ అడవిలో వెలుగుకీ చీకటికీ
తేడాయే ఉండదు
చూపులనుంచి దాచుకోవటానికి
స్థలమనేదే ఉండదు
రోడ్డు మీద బస్సు-లోను, క్లాసులోనూ
వేసే ప్రతి అదుగు వెనకా, సరీరం లోని ఏదో ఒక భాగాన్ని
గాయం చేస్తూ విషపు-చూపులు గుచ్చుకుంతూనే ఉంటై

ఒక్కోసారి భయమేసి సుదూర ఆకాశంలోకి, శూన్యంలోకి
మాయమై పోవాలంపిస్తుంది

కానీ
పలాయనం పరిష్కారం కాదని
విషపు చూపులనెదుర్కొనే ముళ్ళలాంటి తీక్ష్ణతని
కళ్ళకి నేర్పడం మొదలెట్టాను

ఇప్పుడు ఆకళ్ళని వెంటాడటానికి
కళ్ళతోనే యుద్ధం చేస్తాను
సూటిగా రెండు క్షణాలు కళ్ళలోకి చూడలేని పిరికి చూపులు
పాతాళం లోకి పారి పోతై

అప్పుడనుకుంటాను కళ్ళకే కాదు
ఈదేశం లోని ఆడదానికి
వళ్ళంతా ముళ్ళుండే రోజు ఎప్పుడొస్తుందా అని!

ఎక్కడ చదివానో గుర్తు లేదు కానీ రచయిత్రి పేరు జయప్రభ అని మాత్రం తెలుసు. ఆవిడకి నా జోహార్లు