Monday, July 30, 2007

ALWAYS BE ALERT - ఎల్లప్పుడూ సావధానంగా ఉండండి

యెలో బులో లచ్చుగా, సంబుకిరాకి ముచ్చుగా, కితలా కితలా కిట్టిగా ...ఏమిరా ఈ పోంబారి పిలోకి

ALWAYS BE ALERT - ఎల్లప్పుడూ సావధానంగా ఉండండి

There is a dangerous virus being passed around electronically, orally, and by hand.

మీ దిక్కుమాలిన బుర్రలకి ఒక సూచన

This virus is called Weary-Overload-Recreational-Killer (WORK). If you receive WORK from any of your colleagues, your boss, or anyone else via any means DO NOT TOUCH IT.  This virus will wipe out your private Life completely.

మీ మీద పగబట్టి పని భూతం చింత చెట్టు ఎక్కి తిరుగుతోంది...కాబట్టి వినండహో


If you should come into contact with WORK, put your jacket on and take two good friends to the nearest grocery store.  Purchase the Antidote known as Work-Isolating-Neutralizer-Extract (WINE) or Bothersome-Employer-Elimination-Rebooter (BEER). 

ఆ భూతానికి విరుగుడు ఏమిటా ? జాకెట్టు వేసుకుని పచారి కొట్టుకి వెళ్ళి తాగి చావండి సహోదరులారా

Take the antidote repeatedly until WORK has been completely eliminated from your system.

తాగి తాగి ఆ భూతాన్ని వదలగొట్టండహో

You should forward this warning to 5 friends. If you do not have 5 Friends, you have already been infected and WORK is controlling your life.

నీకు ఒక ఐదుగురు స్నేహితులు కూడా లేకపోతే నీ జీవితం వ్యర్ధమురా...కాబట్టి తెలిసిన వాడికి, తెలియనివాడికి కూడా పంపించి నీ తద్దినం నువ్వు పెట్టుకో

Thursday, July 26, 2007

మమకారమా? వికారమా?

"మ" మీద మమకారం?

మర్యాద మరియు మన్నన మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయిన,మరపురాని మలిరోజు మురిపాలు మళ్ళీ మళ్ళీ మీ మనస్సుల్లో ముద్రాక్షరాలుగా ముద్రించుకుని మురిసిపొమ్మని, మంద్రస్వరంతో ముద్దొచ్చే ముద్దుగుమ్మ మాట్లాడుతూ ముచ్చిలిగుంటలోని మదనుడి మశకాలు మెల మెల్లగా మలినమై మసకబారుతున్న మీ మోము మీదకెక్కించగా, మరపురాని మల్లియలతో ముప్పిరికొన్న ముఖారవిందాన్ని మచ్చ మీరని మోడ్పుతో ముడుల ముళ్ళ మీద మీటవా?

Wednesday, July 25, 2007

హలో ..డబ్బు ఎందుకు? ఇందుకు....

మొన్న సోమవారం మాగంటి.ఆర్గ్ వంశీగారితో మాట్లాడుతూ ఉంటే "డబ్బు" గురించి ఒక చిన్న టాపిక్ వచ్చింది. ఆయన వాదనతో నేను ఏకీభవించకపోయినా ఆయన చెప్పినదానిలో కొన్ని పచ్చి నిజాలు ఉన్నాయి అని అనిపించింది.


నా అభిప్రాయం - ప్రస్తుత కాలంలో డబ్బు లేనిదే జీవితం లేదు అని - కానీ ఆయన మాటలు ఇవిగో

"త్యాగా గారు - చాలా మంది సుఖపడటానికి డబ్బు చాలా అవసరం అనుకుంటారు. దానితో నేను విభేదించట్లా. కానీ అది మానసికమయిన సుఖానికి దారి తీస్తుందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెపుతాను.ఎంత డబ్బు ఉండి ఏమి సుఖం అండి.మనిషి మనిషిగా జీవించలేకపోతే, తనకున్న డబ్బుతో సమాజానికి ఉపయోగపడకపోతే అసలు జీవించడం దండగ. ఎక్కడిదాకో ఎందుకు మనకున్న ధనవంతులనే తీసుకోండి - వాళ్ళల్లో ఎంత మంది మన సమాజానికి ఉపయొగపదే పనులు చేస్తున్నారు మీరే చెప్పండి. అదే సమాజానికి సేవ చెయ్యాలి అనే తపన ఉన్నవాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది? వారి వద్ద లేకపోయినా వారు సుఖంగా ఉండి, తమ చుట్టుపక్కల ఉన్నవారి కళ్ళల్లో ఆనందాన్ని చూడట్లా?

మన రాజకీయ నాయకులు, బిజినెస్స్ పీపుల్ని తీసుకుంటే - వేల కోట్లు వాళ్ళ వద్ద మూలుగుతున్నా ఇంకా ఏదో సంపాదించాలి, అని వారు పడే తపన చూస్తే నవ్వు వస్తుంది - అదే తపన కొంచెం సమాజం లోని పేద వారికి ఖర్చు పెడితే ఎందరి జీవితాలు బాగుపడతాయో మీరే ఆలోచించండి. మనమేమీ అప్పు చేసి వాళ్ళ కష్టాలు తీర్చక్ఖరలేదు అండి, మనకున్న దానిలో , మనకు చేతనయినంతలో , మన వద్ద డబ్బు ఉంది కాబట్టి సాయం చేయాలి. లేనప్పుడు ఎలాగూ చెయ్యలేము అని కొద్దిమంది అయినా ఆలొచిస్తే మన దేశం, సమాజం ఎప్పుడో బాగుపడేది"

అని ఒక పెద్ద దీర్ఘమయిన లెక్చర్ ఇచ్చాడాయన.


ఆయన చెప్పిన దానిలో కొన్ని నిజాలు ఉన్నాయి కానీ - ఈ కాలంలో ఆయన చెప్పినవి ఆచరణీయ సాధ్యం కాదు అని నా అభిప్రాయం. ఈ సమాజం అనే చట్రంలో ఎన్నో పనికిమాలిన ఊచలు ఉన్నాయి. అవి అన్నీ ఏరి పారెయ్యాలి అంటే, ఆయన చెప్పిన పనులు చేయాలి అంతే మటుకు సాధ్యం కాదు కాబట్టి - ముక్కు మూసుకుని మన డబ్బు మనం సంపాదించుకుని సుఖపడటం మేలని నా అభిప్రాయం. కొంత మందికి కోపం రావొచ్చు - వీడు ఒట్టి డబ్బు మనిషి అని. కానీ ఏం చేస్తాం. నేను ఎదుర్కున్న సంఘటనలు అలాంటివి మరి. కొంత మందికి ఇలానే డబ్బులు ఇచ్చి చేతులు కాల్చుకున్నాను. అప్పటితో సమాజం లేదు - బొచ్చు లేదు. మన మానాన డబ్బులు సంపాదించుకోవటం, సుఖంగా ఉండటం - ఇదీ నా పరిస్తితి. కొంచెం వయసు వచ్చాక మారతానేమో తెలియదు కానీ...ఇప్పటికి మటుకు ఇంతే.

Sunday, July 01, 2007

అహో ఏమిది? చిన్న పిల్లల పుస్తకాలు కూడా గురువుతో సమానమా?

అహో ఏమిది? చిన్న పిల్లల పుస్తకాలు కూడా గురువుతో సమానమా? - సాహో వంశీ గారూ. దానికి మీరు చెప్పిన కారణం కుడా నాకు నచ్చింది.అయినా మీకు ఇతర పత్రికలు చదివి ఓపికగా వాటికి మీ వ్యాసాలు పంపిస్తున్నారు చూడండి, అందుకు మిమ్మల్ని అభినందించాలి. మీకు అంత సమయం ఎక్కడ దొరుకుతోంది అండి బాబూ.అయినా అదేదో మీ గూట్లోనే పెట్టుకోవచ్చుగా?

చిన్న పిల్లల పుస్తకాలు