Saturday, August 18, 2007

అతిథులు, దిగంబరులు, వ్యాఘ్రము

అతిథులు, దిగంబరులు, వ్యాఘ్రము - అర్ధాలేవో వింతగా ఉన్నాయి ఇక్కడ...నాకు వ్యాఘ్రము అంటే అర్ధం తెలియదు అనుకోండి ఇప్పటిదాకా...ఏమిటి నవ్వుకుంటున్నారా? మా బాబే...

అతిథులు, దిగంబరులు, వ్యాఘ్రము

ఇలా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ...కొన్ని రాతల్లో తప్పులు ఉన్నాయి కానీ, వంశీగారికి చెప్పాలి...

Friday, August 17, 2007

ఆంధ్ర భారతి వారి సైటు నిప్పుల నక్కలో గందరగోళంగా ఉన్నది

ఆంధ్ర భారతి వారి సైటు నిప్పుల నక్కలో గందరగోళంగా ఉన్నది..ఇదే మాట చెపుదామని వారి జాలానికి వెళ్తే అప్పటికే వినయ్ అనే ఒక వ్యక్తి ఆ మాట బరికేసారు..సరె ఎలాగూ వచ్చాము కదా అని నా అవేదన కూడా కక్కి వచ్చా

Thursday, August 16, 2007

కెవ్వు ...కెవ్వు ...కెవ్వు...

కెవ్వు ...కెవ్వు ...కెవ్వు...మళ్ళీ ఒక స్కడ్ వదిలింది "స్నేహ" అమ్మలు మా సాంబి గాడి మీద...బుర్ర బద్దలు బద్దలు ...యమ కాలక్షేపంగా ఉంది నాకు మటుకు...






ఇక్కడ Find x అంటే చక్కగా ఒక గోళం చుట్టింది x మీద...

Tuesday, August 14, 2007

నెత్తురు చుక్కా? నక్షత్రాలా?

మా స్నేహితుడు సాంబ గాడి కూతురు స్నేహ మేధాపటిమ...వయసు పది ఏళ్ళు





స్నేహ మేధాపటిమ


నవ్వలేక చచ్చా...సాంబి గాడి మొహంలో నెత్తురు చుక్కా? నక్షత్రాలా?

Monday, August 13, 2007

దర్వాజాల చారిత్రక ప్రాధాన్యమిదీ..

దర్వాజాల చారిత్రక ప్రాధాన్యమిదీ..

గోల్కొండ కోట చుట్టూ ఉన్న తొమ్మిది దర్వాజాలు వేటికదే ప్రత్యేకతను చాటిచెబుతున్నాయి.

ఫతే(విజయం) దర్వాజా...: కుతుబ్‌షాహీలు శత్రువులపై యుద్ధానికి వెళ్లేపుడు ఈ ద్వారాన్ని ఉపయోగించే వారు. ఈ ద్వారంలోంచి వెళ్లి యుద్ధం చేస్తే తమకు విజయం చేకూరుతుందని వారి నమ్మకం. 1687లో ఔరంగాజేబు ఈ దర్వాజా గుండానే లోనికి ప్రవేశించి అబుల్ హసన్ తానేషాపై విజయం సాధించాడు. అత్యంత దుర్బేధ్యమైన ఈ దర్వాజాను ధ్వంసం చేసేందుకు ఔరంగజేబు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఫలితం లేకపోవడంతో కోటలోని ఓ ద్వార పాలకుడికి లంచం ఇచ్చి ద్వారం తెరిపించి, సైన్యంతో లోపలికి ప్రవేశించి కోటను కైవసం చేసుకున్నాడని చరిత్ర చెబుతోంది.

మకాయి దర్వాజా: గోల్కొండకు పశ్చిమ దిశలో ఉంది. నాటి కుతుబ్‌షాహీరాజులు హజ్(మక్కా)యాత్రకు వెళ్లేందుకు ఈ ద్వారాన్ని ఉపయోగించేవారు. అందువల్ల దీనికి మకాయి అనే పేరొచ్చింది. మక్కాయాత్ర తప్ప ఆ ద్వారం గుండా ఎవరూ రాకపోకలు సాగించే వారు కాదు.

బౌద్లి దర్వాజా: కుతుబ్‌షాహీ వంశజుల్లో ఏడో రాజు అబుల్‌హసన్ తానేషా పాలనలో బౌద్లేషా సహబ్ సైనికాధికారిగా ఉండే వాడు. అతని పేరు మీదుగా బౌద్లిదర్వాజా అని పిలుస్తున్నారని తెలుస్తోంది.

మోతీ దర్వాజా: గోల్కొండ కోటలో వ్యాపారం చేసుకునేందుకు వచ్చే వారు వచ్చే ద్వారమిది. ప్రతి శుక్రవారం ఇక్కడ పెద్ద సంత నిర్వహించేవారు. ఇరాన్, టర్కి, తదితర దేశాల నుంచి వచ్చే వ్యాపారులు మోతీ దర్వాజా నుంచి వచ్చి వర్తకం చేసేవారు. అందుకే దీనికి మోతీ(ముత్యం) అన్న పేరు వచ్చింది.

జమాలీ దర్వాజా: కుతుబ్‌షాహీ రాజుల్లో రెండో రాజైన ఇబ్రహీం కులీకుతుబ్‌షా తన భార్య జమాలీ పేరును ఈ దర్వాజాకు పెట్టాడు.

బంజారా దర్వాజా: ఈ ద్వారం గుండా బంజారాలు, ఆదివాసీలు కోటలో పనులు నిర్వహించేందుకు వచ్చేవారు. పండ్లు, కలప తదితరాలు ఈ దర్వాజా గుండా తీసుకువచ్చేవారు.

పటాన్‌చెరు దర్వాజా: పటాన్‌చెరు ద్వారం నుంచి రైతులు తాము పండించిన పంటను కోటలోకి తెసుకువచ్చి, వస్తుమార్పిడి చేయడంతో పాటు వ్యాపారం చేసుకునేవారు. చివరి రాజైన అబుల్‌హసన్ తానీషా తన హయాంలో ఈ దర్వాజాను కారాగారంగా ఉపయోగించాడు.

బహమనీ దర్వాజా: 1363లో గోల్కొండ కోటను బహమనీ సుల్తానులు పాలించేవారు. బహమనీ వంశజుల కాలం నుంచి ఈ దర్వాజాకు బహమనీ దర్వాజా అని పేరొచ్చింది.

బాలాహిస్సార్ దర్వాజా: బాలాహిస్సార్ అంటే ఎత్త్తెన ప్రదేశం. గోల్కొండ కోటకు ఇది భద్రతకు సంబంధించిన దార్వాజా. గట్టి నిఘాతో సైనికులు కాపలా కాసేవారు. శత్రువులు అన్ని దర్వాజాలు దాటి వచ్చినా చివరిదైన ఈ దర్వాజాను దాటకుండా సైన్యం భద్రత కల్పించేది.

ఈనాడు వారి ఆర్టికల్

Thursday, August 09, 2007

ఇదేం రాతలు అండి బాబోయి!

వంశీ గారు - ఇదేం రాతలు అండి బాబోయి.ఎప్పుడో "దడిగా డువానసిరా" అని చదివినట్టు గుర్తు. అది మళ్ళీ గుర్తుకొచ్చింది.

ఇదేం రాతలు అండి బాబోయి!

ఇదే వాక్యం ఇక్కడ చూడండి "యినాచ్చిలొక్కరె కుహఊ ఆ డుప్పుఇ ళ్ళీమ....నుసానేమా నోకదుంఎ...డాకూ నిడివాసేరా ర్లుసా న్నికొ డుప్పున్నచి...దిఇ కఒ నిఅ లియారా లాఇ కునా"

Monday, August 06, 2007

ఏమిటి మార్గం?

ఏమిటి మార్గం?

ధాతువులు క్షీణించటం, వాతం ప్రకోపించటం.. ఈ రెండూ వృద్ధాప్య వ్యాధులకు మూలం కాబట్టి.. ఈ సమయంలో తిరిగి ధాతువులన్నింటినీ పెంపొందించటానికి చేసే 'రసాయన చికిత్స' కీలకమని ఆయుర్వేదం నిర్దేశిస్తోంది.

అయితే 'చికిత్స' అంటే కేవలం ఔషధాలు తీసుకోవటం మాత్రమే కాదు. మన దినచర్య, ఆహార విహారాలు, మానసిక ప్రవృత్తి వంటివన్నీ కూడా చికిత్స కిందకే వస్తాయి. అందుకే ఈ రసాయన చికిత్స.. ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటుంది.

1 ఆజశ్రిక రసాయనం: ఆజన్మాంతం మనందరం ధాతువులను సంరక్షించుకోవటానికి నిత్యం చేసుకోవాల్సిన చికిత్స ఇది. 'నిత్యం క్షీర ఘృతాభ్యాసీ' అంటుంది ఆయుర్వేదం. అంటే అందరం చిన్నతనం నుంచీ పాలు, నెయ్యి తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల ధాతువులు సక్రమంగా ఉండి, దోషాలు ఎంత ప్రకోపించినా కూడా దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి. అలాగే మన దినచర్య, సీజన్లవారీగా అనుసరించాల్సిన రుతుచర్య కూడా చక్కగా ఉండాలి.

2. నైమిత్తిక రసాయనం: ఏదైనా వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత.. ఆ వ్యాధినిమిత్తంగా ఏయే ధాతువులు వికృతి చెందాయో వాటిని తిరిగి సరిచేసేందుకు.. చేసే చికిత్స ఇది. వృద్ధాప్యంలో దీని ప్రాముఖ్యం చాలా ఎక్కువ.

3. కామ్య రసాయనం: అవసరానికి తగినట్టుగా దేనినైనా పెంపొందించటానికి చేసే చికిత్స ఇది. ఉదాహరణకు ఆయుర్దాయాన్ని పెంచేందుకు, జ్ఞాపకశక్తిని పెంచేందుకు.. ఇలా రకరకాలుగా అవసరానికి తగినట్టుగా చేసే చికిత్స ఇది.

4. ఆచార రసాయనం: ఒక్కోసారి ఒత్తిడి తదితర పరిణామాల వల్ల మానసిక పరివర్తన రావటం, జ్ఞాపకశక్తి తగ్గటం వంటివి జరుగుతుంటాయి. ఇటువంటివి తలెత్తకుండా ఉండటానికి స్థిర చిత్తంతో ధ్యానం, యోగం, మానసిక వ్యాయామాల వంటివి చాలా అవసరం. ముఖ్యంగా అరిషడ్వర్గాలైన 'కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను' అదుపులో ఉంచుకోవటం, ఎప్పుడూ మంచిని కోరటం, మంచినే ఆలోచించటం, ఇతరులు కనబడితే మనమే ముందుగా పలకరించటం.. ఇలాంటివి ముఖ్యం. ఇవీ చికిత్సలో భాగమే.

ఇలా చక్కటి ఆహారం-వ్యాయామాలతో కూడిన దినచర్య, రుతుచర్య సక్రమంగా పాటిస్తుంటే ఆయుర్దాయం, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. ధాతు క్షీణత తక్కువగా ఉంటుంది. అవసరాన్నిబట్టి ఇందుకు అనుగుణమైన ఔషధాలను కూడా తీసుకుంటే మలి వయసులో శరీరంలో వచ్చే మార్పులు, పరిణామాలను, వ్యాధులను ఎదుర్కొనే శక్తి కూడా బలపడుతుంది! మలివయసు ఆహ్లాదకరంగా గడుస్తుంది!!

కీళ్ల నొప్పులు
మన శరీరంలో ఒక్కో ధాతువును ఆశ్రయంగా తీసుకుని ఒక్కో దోషం ఉంటుంది. ఉదాహరణకు వాతం పెరిగితే అస్థి (ఎముకల) ధాతువు క్షీణిస్తుంది, అస్థి ధాతువు క్షీణిస్తే వాతం పెరుగుతుంది. వృద్ధాప్యంలో ఈ రెండూ జరిగే అవకాశం ఉంది కాబట్టి సహజంగానే కీళ్ల నొప్పుల బాధలెక్కువ. దీనికి వాతాన్ని, నొప్పులను హరించే తైలాలు, ఘృతాలు, గుగ్గుల వంటివి బాగా ఉపకరిస్తాయి. ఇందుకు: మహాయోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, వీటితో ఫలితం లేకపోతే స్వర్ణఖచిత మహాయోగరాజ గుగ్గుల వంటి రకరకాల గుగ్గులు తీసుకోవచ్చు. ఇవే కాకుండా వైద్యుల సలహాతో రాసనాది క్వాథం (కషాయం), మహారాసనాది క్వాథం, దశమూల క్వాథం, ధాతు పుష్టికి అశ్వగంధ చూర్ణం, అశ్వగంధారిష్టం వంటివి తీసుకోవచ్చు.

మలబద్ధకం
కఫ పిత్తాలు రెండూ కూడా ద్రవధాతువులు. ఒంట్లో ఇవి తగ్గి, వాతం ప్రకోపించినప్పుడు అది నీటిని ఎక్కువగా పీల్చుకుంటుంది, ఫలితంగా మలం గట్టిబడి 'మలబద్ధకం' ఏర్పడుతుంది. ఈ వాతప్రధానమైన మలబద్ధకాన్ని తగ్గించటానికి: రోజూ రాత్రిపూట పడుకునేటప్పుడు కొద్దిగా త్రిఫల చూర్ణాన్ని వేడి నీటితో తీసుకుంటే ఉదయాన్నే సాఫీగా ఒక్క విరేచనమవుతుంది. నిజానికి మలబద్ధకానికి ఆయుర్వేదంలో అపూర్వ ఔషధాలున్నాయి. కోరుకున్నన్ని సార్లు మాత్రమే విరేచనమయ్యేలా చేస్తుంది ఇచ్ఛాభేది రసం. ఇంకా స్వాదిష్ట విరేచన చూర్ణం, పంచ సకార చూర్ణం వంటివీ ఉన్నాయిగానీ వీటిలో లవణాలు ఉంటాయి కాబట్టి బీపీ ఉన్నవాళ్లు వీటిని వాడుకోకూడదు. అందరూ వాడుకోతగ్గది ఉసిరికాయ-కరక్కాయ-తానికాయల సమ్మిశ్రమమైన త్రిఫల! అసిడిటీ ఉన్నవాళ్లు అవిపత్తికర చూర్ణం రోజూ వాడుకుంటే ఆ బాధా తగ్గుతుంది, విరేచనమూ చక్కగా అవుతుంది.

జ్ఞాపక శక్తి
ఆయుర్వేదం ప్రకారం.. సమస్థితిలో ఉన్న కఫం జీవశక్తికి మూలం. వృద్ధాప్యంలో వాతం పెరిగి శరీరంలో కఫ ప్రభావం తగ్గుతుంది. దీంతో బుద్ధికి సంబంధించిన జీవకణాల్లో కూడా శక్తి తగ్గి.. జ్ఞాపకశక్తి సన్నగిల్లటం వంటి బాధలు మొదలవుతాయి. దీన్ని తిరిగి పెంపొందించేందుకు మేధ్య రసాయనాలైన బ్రాహ్మీ ఘృతం, బ్రాహ్మీ లేహ్యం, సారస్వత లేహ్యం, సారస్వతారిష్టం, శంఖపుష్పి, శంఖపుష్పి రసాయనం.. వంటివి బాగా ఉపకరిస్తాయి. 'ఘృతం అగ్నిమేధే కరోతి' అంటుంది ఆయుర్వేదం. అంటే నెయ్యి ఆకలినీ, మేధస్సునూ పెంచుతుంది. కాబట్టి చెంచా బ్రాహ్మీ ఘృతాన్ని వేణ్ణీళ్లలో, వేడి పాలలో వేసుకుని తీసుకోవటం మేలు చేస్తుంది.

దంత సమస్యలు
వృద్ధాప్యంలో దంత సమస్యలు కొంత ఎక్కువే. త్రిఫల చూర్ణాన్ని కొద్దిగా నీటిలో వేసుకుని కషాయం కాచుకుని దాన్ని పుక్కిలిస్తే దంత సమస్యలు అంతగా బాధించవు. ఇరిమేదాది తైలం చిగుళ్లకు రాసుకుంటే చిగుళ్ల వ్యాధులు, రక్తం రావటం వంటి బాధలు తగ్గుతాయి. దంత సమస్యలకు మలబద్ధకం కూడా కొంత వరకూ కారణమవుతుంది కాబట్టి లోపలికి త్రిఫల చూర్ణం తీసుకుంటే మేలు. నిత్యం త్రిఫల చూర్ణంతో దంతధావనం చేస్తే కదిలే దంతాలు క్రమేపీ గట్టిబడే అవకాశం కూడా ఉంటుంది.

నిద్రలేమి
నిద్రలేమి కూడా వాత ప్రధానమైన సమస్యే. దీనికి 'జటామాంసి క్వాధం' బాగా ఉపయోగపడుతుంది. జటామాంసి కొబ్బరి పీచు మాదిరిగా ఉంటుంది. దీన్ని కొద్దిగా నీటిలో వేసి కషాయం కాచుకుని రోజూ ఒక పావు గ్లాసు తీసుకుంటే నిద్ర లేమి సమస్య బాగా తగ్గుతుంది. శంఖపుష్పి సిరప్ కూడా నిద్ర పట్టేలా చేస్తుంది. వీటితో దుష్ప్రభావాలూ ఉండవు. పాలు కూడా నిద్రా జనకమైనవే. రాత్రిపూట గోరువెచ్చటి పాలు తాగి పడుకుంటే నిద్ర బాగా పడుతుంది.

పడిపోవటం
తల తిరగటం, తుళ్లిపడటం, కళ్లు తిరగటం, భ్రమ వంటివి కూడా వృద్ధుల్లో ఎక్కువ. ఇవన్నీ కూడా వాతంలో ఉండే రజోగుణ ప్రధానం వల్ల సంభవిస్తాయి. వీటికి సర్వధాతు పుష్టినిచ్చే.. అశ్వగంధ లేహ్యం, అశ్వగంధ చూర్ణం, ముఖ్యంగా వసంత కుసుమాకరం, చ్యవనప్రాశ లేహ్యం వంటివి తీసుకుంటే కొంత వరకూ ఉపయోగం ఉంటుంది. వైద్యులను సంప్రదిస్తే లక్షణాలను బట్టి ఔషధాన్ని ఎంపిక చేసి ఇస్తారు.

వ్యాధి నిరోధక శక్తి తగ్గటం
ఆయుర్వేదం ప్రకారం రక్షణ వ్యవస్థ అంతా మన శరీరంలో ధాతువులను ఆశ్రయించుకుని ఉంటుంది. కాబట్టి ధాతువులను పెంపొందించటం ద్వారా ఈ వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇందుకు: వసంత కుసుమాకరం, అశ్వగంథ చూర్ణం, అశ్వగంధ లేహ్యం, అశ్వగంధారిష్ట, చ్యవనప్రాశ లేహ్యం వంటి సర్వధాతు పుష్టికర రసాయనాలు బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిత్యం తగు మాత్రంగా పాలూ, నెయ్యీ తీసుకోవటం వల్ల కూడా ధాతు పుష్టి పెరిగి... వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

జీర్ణశక్తి
వృద్ధాప్యంలో జీర్ణాశయం కుంచించుకుని.. తీసుకునే అన్నం పరిమాణం తగ్గిపోతుంది, ఆకలీ కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి ఆకలి పెరిగేందుకు రోజూ అన్నం తినేటప్పుడు.. మొదటి ముద్దలో కొద్దిగా అల్లం పచ్చడి తింటే మంచిది. అల్లం, ధనియాలు, కొత్తిమీర, తక్కువ మిరపకాయలతో చేసే అల్లం పచ్చడిని రోజూ మొదటి ముద్దలో తింటే ఆకలి పెరుగుతుంది. అలాగే సోంపు లేదా జీలకర్ర కషాయం కాచుకుని తాగితే ఆకలి, జీర్ణశక్తి రెండూ పెరుగుతాయి. జీర్ణశక్తికి జీలకర్ర ఉత్తమం. ఔషధాల్లో ఆకలి పెరిగేందుకు అగ్నితుండి వటి మాత్రలు, భాస్కర లవణం చూర్ణం, హింగ్వష్టక చూర్ణం, శివాక్షార పాచన చూర్ణం ఉపకరిస్తాయి. దాడిమాష్టక చూర్ణం ఆకలి పెంచుతుంది, విరేచనాలు కడుతుంది. జీర్ణశక్తికి జీరకాద్యరిష్టం, ఆకలికి ద్రాక్షాసవం కూడా మంచివే.


ఈనాడు వారి ఆర్టికల్

Sunday, August 05, 2007

అంధుడైతేనేం... గానగంధర్వుడు!

అంధుడైతేనేం... గానగంధర్వుడు!

పిల్లనగ్రోవితో శ్రోతలను కట్టిపడేసే లింగయ్య
30 ఏళ్లుగా ఒకే ప్రదేశంలో...

లింగయ్యపై ఓ రచయిత పుస్తకం 'లే పెన్స్యూర్'

పిల్లనగ్రోవి అతని చేతిలో ఉందంటే చాలు... శ్రావ్యమైన సంగీతం బయటికి వస్తుంది. కొత్తవి, పాతవి ఏపాటలైనా శ్రోతలను కట్టిపడేసేలా వినిపిస్తాడు. రోజూ ఒక్కసారైనా అతని పాట వినకుంటే కొందరు ఆరోజు ఏదో కోల్పోయినట్లు భావిస్తారంటే అతిశయోక్తి కాదేమో!ఇంతటి ప్రతిభ ఉన్న ఈ గాయకుడు ప్రముఖ సంగీత కళాకారుడూ కాదు... సంగీతంలో శిక్షణ తీసుకున్నవాడూ అసలేకాదు. పిల్లనగ్రోవి వాయించడం అలవాటుగా మార్చుకుని యాచకవృత్తిలో బతుకీడుస్తున్న అంధుడు లింగయ్య.

న్యూస్‌టుడే, నల్లకుంట - ఈనాడు సౌజన్యం

పాలమూరు జిల్లా రేవల్లెకి చెందిన ఉల్లెందుల లింగయ్య(70) పుట్టంధుడు. బతుకుబాటలో నగరానికి వలస వచ్చాడు. శంకరమఠం నుంచి న్యూనల్లకుంట వంతెన వైపు వెళ్లే దారిలో ఒకేచోట కూర్చొని 30 ఏళ్లుగా పిల్లనగ్రోవితో మధుర స్వరాల్ని వినిపిస్తున్నాడు. ఐదారేళ్ల వరకూ తల్లే ఆలనాపాలనా చూసేది. ఆమె పోయాక ఎప్పుడూ ఇతనితోపాటే ఉండే మేనమామ బాగోగులు చూస్తున్నాడు. దారిన వెళ్లేవారు ఈయన సంగీతానికి ముగ్ధులై ఇచ్చే చిల్లరపైసలతోనే పొట్టనింపుకొంటాడు. ఆ దారిన పోయేవారికి లింగయ్య సుపరిచితుడే. కాస్తంత తీరిక దొరికితే అక్కడ ఆగి లింగయ్యతో తమకిష్టమైన పాట ఒకటి పాడించుకుని ఆస్వాదించే ఆయన అభిమానులూ ఉండటం విశేషం. లింగయ్య రెండుమూడు రోజులు అక్కడ కనపడకపోతే ఆయన గురించి ఆరా తీసేవారూ ఉన్నారని స్థానికులు చెపుతున్నారు. రోజూ దేవుని సుప్రభాతం వినడం కుదరకపోయినా... ఉదయం ఎనిమిదిన్నర వేళ లింగయ్య పిల్లన గ్రోవితో వినిపించే మధుర సంగీతాన్ని నిత్యం తప్పక ఆస్వాదిస్తామని ఆ ప్రాంతంలో ఉండే వారంటున్నారు.
ఆయనపై ఓ పుస్తకం 'లే పెన్స్యూర్'
ఈ అంధుడి గురించి పూర్తిగా అధ్యయనం చేసిన ఓ సామాన్య వ్యక్తి కందుకూరి రమేష్‌బాబు ఏకంగా లింగయ్యపై ఓ పుస్తకాన్నే రాశాడు. లింగయ్య కేవలం పిల్లనగ్రోవితో సంగీతాన్ని విన్పించడమే కాక మంచి ఆలోచనాపరుడని, అతనిలో ఓ కవీ దాగున్నాడని గ్రహించే తాను 'లే పెన్స్యూర్' పుస్తకం రాశానని రమేష్‌బాబు చెప్పారు.

పుస్తకావిష్కరణ... ఘన సన్మానం
'లే పెన్స్యూర్' పుస్తకాన్ని ఆదివారం లింగయ్య రోజూ కూర్చునేచోటనే ఆవిష్కరించారు.అందులోనూ ఓ ప్రత్యేకత... స్వీపర్ లింగమ్మతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. తర్వాత లింగయ్యను ఘనంగా సన్మానించారు. కొందరు తమకు తోచిన నగదునూ బహూకరించారు.కార్యక్రమానికి నిత్యం ఆయన పాటలు ఆస్వాదించే స్థానికులు, ఆ దారిన వెళ్లేవారు అధిక సంఖ్యలోనే వచ్చారు. మాజీ కార్పొరేటర్ వనం రమేష్ , పాత్రికేయుడు భాస్కరం, సాహిత్య అభిమాని వేదకుమార్, రచయిత నిజాం వెంకటేష్, కవి సిద్ధార్థ, ఆర్కే, చిత్రకారుడు చంద్ర హాజరయ్యారు.

Friday, August 03, 2007

నమ్మితే నమ్మండి లేకపోతే లేదు!

ఈ దిక్కుమాలిన దేశానికి వచ్చి చాలా రోజులు అయ్యింది. ఎన్నో తెల్లతోళ్ళతొ పనిచెయ్యటం జరిగింది. నా పేరుని మటుకు ఖూనీ చెయ్యని ము.కొ ఒక్కడు కూడా కనపడలేదు ఈ తోలు మందం వెధవల్లో. ఒకడు "ట్యాగా" అని, ఇంకొకడు "టై ఆగా" అని, ఇంకొకడు వెరైటీగా ఉంటుంది అని "టై" అని, నోరు తిరగని బండ నాలికెట్టుకుని, దానికి తోడు ఏడాదికేడాది పళ్ళు కూడా తోమకుండా లిస్టరీన్ తో నోరు పుక్కిలించి దగ్గరికెళితే ఎలకల వాసన కొట్టకుండా అత్తర్లు పూసుకుని, లోపల మన దేశీగాళ్ళని బండ బూతులు తిట్టుకుంటూ పైకి మటుకు "నువ్వు సూపరు, నిన్ను మించినవాడు లేడు ట్యాగా" అనే వాళ్ళెంతమందో మధ్య మెసలటం అయ్యింది.సరే ఇలా ఉందా అని సౌత్ కారోలీనాలో ఉన్నప్పుడు ఒక చిన్న కంపినీలో పని చేసే రోజుల్లో, ఎవరు నా పేరుని ఖూనీ చేసారో వాళ్ళ పేర్లు నేను కూడా ఖూనీ చెయ్యటం మొదలుపెట్టా....చేరిన కొన్ని రోజులకి కాకుండా, అంటే వాళ్ళకి అనుమానం రాకుండా మొదటిరోజునుండే ఈ యుద్ధం మొదలు పెట్టా...

ఇది నిజమయిన సంఘటన - నమ్మితే నమ్మండి లేకపోతే లేదు..

వాళ్ళని ఇలా పిలిచేవాడిని - ఇవి అన్నీ నిజమయిన మనుషుల పేర్లు, నాతో పని చేసిన దరిద్రుల పేర్లు

పాల్ - పవుల్, పాలు
బేలా - బెల్లాహ్
జేమ్స్ - జమెస్
జాన్ - జోహన్
కోలింగ్ - కాల్లింగ్
పీటర్ - పీతర్

ఇలా ఒక ప్రహసనం లాగించా అన్న మాట. ఇది తలచుకున్నప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను.

ఇక ఆ ఉద్యోగం ఎన్ని రోజులు వెలగబెట్టానో చెప్పాలి అనుకుంటా మీకు..సరిగ్గా నూటా ఎనభై రోజులు.. నా హింసకి తట్టుకోలేక చివరికి నా పేరుని, నన్ను "రాజా" లోకి దించారు...

Wednesday, August 01, 2007

నడుపీనుగు వచ్చెననుచు

గడన గల మగని జూచిన
నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలో
గడనుడుగు మగని జూచిన
నడుపీనుగు వచ్చెననుచు నగుదురు సుమతీ!

చీపర బాపర తీగల

చీపర బాపర తీగల
చపల బుట్టల్లినట్టు చెప్పెడి నీ యీ
కాపు కవిత్వపు కూతలు
బాపన కవివరు చెవికి ప్రమదంబిడునే!

బాచన్నను జూచి పట్టపగల వెరతుర్!

బూచా? బూచుల లోపల
బాచన్న పెద్దబూచి, పండ్లున్ దానున్;
బూచనిన రాత్రి వెరతురు
బాచన్నను జూచి పట్టపగల వెరతుర్!

జొన్న కలి జొన్న యంబలి

జొన్న కలి జొన్న యంబలి,
జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలె తప్పన్,
సున్నసుమీ సన్నన్నము
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకున్

నాని నీనాను నీనును నానినాను

నాని నీనాను నీనును నానినాను
నాన ననును
నిన్నూని నున్ననన్న
నెన్న నున్నను నిన్నెన్న నున్న నాన
నిన్న ననన్న
నున్న నన్నెను నన్ని

కులముల మనముల తాలిమి!

పలుకుల, నగవుల, నడపుల,
నలుకల, నవలోకనముల నాభీర వధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదిలించు ఘనుని కొలిచెద మదిలోన్

బూతు లేని లంజ భూతమ్ము కూతురు !

బూతు లేని లంజ భూతమ్ము కూతురు
ప్రీతి లేని పాటు రాతి చాటు
దాత లేని యూరు దయ్యాల పేటరో
విశ్వదాభిరామ వినుర వేమ!



ఇది ఆరుద్రగారో,ఆత్రేయ గారో ఎవరో రాసారు అని మా సాంబు గాడు చెప్పాడు..నిఝ్ఝం అని కూడా వక్కాణించాడు ...ఈ టపాకి మటుకు వాడిదే బాధ్యత అని నేను కూడా వక్కాణిస్తున్నాను...మీ తిట్లు దీవెనలు వాడికే చెందుతాయని కుడా తెలియచేసుకుంటున్నాను

రవిబింబంబు

రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై,
శ్రవణాలంకతియై,గళాభరణమై, సువర్ణ కయూరమై,
ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచత్ఘంటయై, నూపుర
ప్రవరంబై, పాదపీఠమై, వటుడు దా బ్రహ్మాండము నిండుచోన్

అడిగెదనని కడువడి

అడిగెదనని కడువడి జను నడిగిన
తన మగడు నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు
నడుగిడదు నడుమ నడుగిడు నెడలన్

గురువని చెప్పగ లదిది

గురువని చెప్పగ లదిది
గురుతుగ చెప్పంగ నల గురువని యెుకనిన్
గురి గొని యుండెడు శిష్యుడె
గురువగు కొన్నాళ్ళ పిదప ఘనత వహింపన్