Sunday, January 28, 2007

క్రీస్తు - కృష్ణుడు పోలిక

క్రీస్తు - కృష్ణుడు పోలిక

ఇక్కడ చదవండి...

ftp://ia300203.us.archive.org/3/items/ChristVersusKrishna/

డి జె వి యు లంకె నొక్కండి

గురుజాడ - కన్యాశుల్కంలోని ప్రధాన పాత్రలు

గురుజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలోని ప్రధాన పాత్రలు
1. అగ్నిహోత్రావధాన్లు - కృష్ణరాయపురం అగ్రహారీకుడు
2. వెంకమ్మ - అగ్నిహోత్రావధాన్లు భార్య
3. బుచ్చమ్మ - అగ్నిహోత్రావధాన్లు పెద్ద కూతురు
4. సుబ్బమ్మ - అగ్నిహోత్రావధాన్లు చిన్న కూతురు
5. వెంకటేశం - అగ్నిహోత్రావధాన్లు కుమారుడు
6. కరటక శాస్త్రి - అగ్నిహోత్రావధాన్లు బావమరిది, ఇతను విజయనగరం నాటక కంపెనీలో విదూషకుడు
7. శిష్యుడు - కరటక శాస్త్రి శిష్యుడు
8. లుబ్ధావధాన్లు - రామచంద్రపురం అగ్రహారీకుడు
9. మీనాక్షి - లుబ్ధావధాన్లు కుమార్తె, వితంతువు
10. రామప్పంతులు - రామచంద్రపురం అగ్రహారం కరణం
11. గిరీశం - లుబ్ధావధాన్లు పినతల్లి కొడుకు, వెంకటేశానికి చదువుచెప్పే అయ్యవారు
12. సౌజన్యారావు పంతులు - వకీలు
13. భీమారావు పంతులు - ప్లీడరు
14. నాయుడు - ప్రైవేటు వకీలు
15. పూజారి గవరయ్య - దెయ్యాల మాంత్రికుడు, వైద్యుడు
16. మధురవాణి - వేశ్య
17. ఇతరులు బంట్రోతు, పూటకూళ్ళమ్మ, సిద్ధాంతి, పోలిశెట్టి, హెడ్ కనిష్టీబు, బైరాగి, దుకాణదారు, గ్రామ మునసబు, యోగిని, అసిరిగాడు, మనవాళ్ళయ్య, వీరేశ, తహసీల్దారు, డిప్టీ కలక్టరు, వగయిరా.

Tuesday, January 23, 2007

విశాలంధ్ర దేశ కథ - కల్పితము

ఇందులోని వ్యక్తులు గానీ పాత్రలు కానీ ఎవరినీ ఉద్దేశించి రాసినవి కాదు అని మనవి. ఒకవేళ నిజజీవితములో ఎక్కడయినా సామీప్యం కనపడితే అందుకు నా బాధ్యత ఏమీ లేదని , ఇది కేవలం కల్పితముగా వ్రాయబడినది అని సభాముఖంగా విన్నవించుకుంటున్నాను.



అనగనగా ఎక్కడో కృష్ణా , గోదావరీ తీరాల మధ్యలో ఉన్న విశాలాంధ్ర దేశాన్ని భూస్వాహా రెడ్డి అనే ఒక గొప్ప రాజు పరిపాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడేవారు. ఎందుకా ? ఆయన రాజ్యం లోని మంత్రులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రజల కష్టార్జితాన్ని విశృంఖలంగా దోచుకుంటూ, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తూ సామాన్య ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేసేవారు. ఈ అమాత్య్వర్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా గొప్ప చరిత్రలు ఉన్నాయి. కాని వారు ఎంత దుర్మార్గులయినా అప్పుడప్పుడు పత్రికల వారితో హాస్యస్ఫోరక సంభాషణలు జరిపేవారు. ఉదాహరణకి ఒక చిన్న సంఘటన చూద్దామా ఇప్పుడు - ప్రచార శాఖా అమాత్యులు బొచ్చె కత్తినారాయణగారు ఉన్నట్టు ఉండి వారి అమాత్య పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్ధపడ్డారు. ఎందుకురా నాయనా అంటే ఆయన గారి తమ్ముడు బొక్కల నరసిమ్హం కి గ్రామ సిమ్హం పదవి ఇవ్వడానికి రాజు గారు అంగీకరించలేదు అని. మరి రాజు గారు ఎందుకు అంగీకరించలేదు? రాజుగారికి తన వంశంలోని వాళ్ళు తప్ప ఇంకెవరి వంశంలోనూ ఇద్దరికి మించి పదవులలో ఉండకూడదు అని ఒక నిశ్చితాభిప్రాయం ఉండేది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకోవాలి. బొచ్చె గారి భార్య లక్ష్మీ బాయి రాజుగారి సేనలోని అశ్వదళానికి సేనాపత్ని. ఈవిడకి ప్రపంచ జ్ఞానం ఏమీ లేకపోయినా, రాజకీయాల గురించి ఏమీ తెలియకపోయినా అమాత్యుల వారి భార్య కావటం వల్ల సేనాపత్ని పదవిలో అలంకరింపచేసారు. అది చూసి బొక్కల నరసిమ్హంకి అంతా అయోమయం అగమ్యగోచరం గా అయిపోయి, అన్నయ్యా, మరి ఏమీ తెలియని వదినకే సేనాపత్ని పదవి కట్టబెట్టావు, మరి నువ్వు చేసే ఇన్ని దుర్మార్గాలలో పాలుపంచుకున్న నాకు యే పదవి ఇప్పించలేవా ? పోనీ పెద్ద పదవులు వద్దు ఒక గ్రామ సిమ్హం పదవి ఇప్పించు.స్వయంగా నేను ప్రజలని కండలూడేలా కరిచి కొరికి వారిని పిండి పిప్పి చేస్తాను. మనము మన వంశం కొన్ని వందల యేళ్ళ దాకా సరిపడే మాంసం(ధనం) సంపాదించి నీ కాళ్ళ వద్ద పడేస్తాను అని వేడుకున్నాడు. ఇక అమాత్యవర్యుల దుర్మార్గపు గుండే కరిగిపోయి రాజు గారి వద్దకి పరిగెత్తి "రాజా - నేను బోగస్ వాగన్ను లో డబ్బులు బొక్కినా, అన్యాయంగా పేదల భూములు బొక్కినా - అంతా ఎవరికోసం చేశాను ? మీ కోసం మీ దేశంకోసం. నేను బొక్కిన ధనలో మీ వాటా మీకు ఇచ్చేసాను కూడా. అలాంటి దుర్మార్గుడిగా నాదొక చిన్న కోరిక. మా తమ్ముడిని తప్పక గ్రామ సిమ్హంగా నియమించమని కోరుతున్నాను. వాడు తప్పక మొరిగి కరిచి మరింత ధనం తీసుకుని వచ్చి మీ పాదాల ముందు పడవేస్తాడు. ఆ మాత్రం నమ్మకం ఉంచండి" అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు రాజు గారు "ఓరోరి బొచ్చె కత్తినారాయాణా - ఎన్ని సారులు చెప్పవలెరా నీకు. మొదటగా నీ దిక్కుమాలిన పత్నిని తీసుకుని వచ్చి సేనాపత్నిగా నియమించమని కోరావు. సరే అని అన్నాను. ఇప్పుడు వచ్చి మీ తమ్ముడికి సిమ్హం పదవి గాడిద గుడ్డు పదవి అంటావు ఏమిరా ?" అని హుంకరించాడు. ఆ హుంకారం విని బొచ్చె గారికి తిక్క రేగి - "ఓరే దుర్మార్గపు రాజా - నీ కోసం నేను నా వంశం కుక్కల లాగా పని చేశి ఒక చిన్న కోరిక కోరితే, అది ఇవ్వడానికి నీ మనసొప్పట్లెదా? అయితే కాచుకో నా రాజీనామా అస్త్రం. ఇది ప్రయోగించాను అంటే భూనభోంతరాలు దద్దరిల్లి పోతాయి. దేశం సర్వ నాశనమయిపోతుంది. నా రాజీనామా వల్ల వచ్చే తీవ్ర తదనంతర పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాలి" అని హెచ్చరించాడు. భూస్వాహా మహారాజుకి ఇలాంటివి అన్ని కొత్త కాదు కాబట్టి, "ప్చ్" అని పెదవి విరిచి హేళణగా ఒక చిరుమందహాసం చిందించి తన పులివెన్ను ఊరినుంచి తెప్పించిన సాలభంజికల సిమ్హాసనం ఎక్కటానికి చక్కా పోయాడు.

తదుపరి సన్నివేశం త్వరలో...

Monday, January 22, 2007

నన్నయగారి భారతములో ఒక మంచి పద్యం

నన్నయగారి భారతములో ఒక మంచి పద్యం

సురపతి సభ జూడన్, జూడ నంగారవృష్టుల్
గురిసె, కులిశధారలు కుంఠితంబయ్యె, దిక్కుం
జరమదము లడంగెన్, సర్వదిక్పాలకాంతః
కరణములు భయోద్వేగంబునన్ సంచలించెన్


గరుత్మంతుడు అమృతమును తెచ్చుటకై స్వర్గమునకు వెళ్ళగా అక్కడ ఉత్పాతాలు పుట్టాయి అని అర్ధం అట .

జలజల రాలే చినుకును నేను - అద్భుత కవిత

జలజల రాలే చినుకును నేను
గలగల పారే ఏరును నేను
అలలతొ పొంగే కడలిని నేను
అందరు కోరే జలమును నేను

మనుజుల కైనా మెకముల కైనా
చెట్టుల కైనా పిట్టల కైనా
దప్పిక దీర్చే జలమును నేను

భూమిని ఉన్నా మట్టిని కలసి
నింగిని ఉన్నా మబ్బులొ దాగి
మధ్యలొ ఉన్నా గాలిని గూడి
అంతట ఉన్నా ఆకృతి మార్చి
అందరు కోరే జలమును నేను

తీయటి రసముగ ఒకచోట
ఉప్పటి నీరుగ ఒకచోట
తెల్లని మంచుగ ఒకచోట
నల్లని నీటిగ ఒకచోట

స్వచ్ఛము గాను ఒకచోట
పంకిలమగుచు ఒకచోట
తేలెడి గడ్డగ ఒకచోట
రాలెడి రేకుగ ఒకచోట

ఆవిరి రూపున ఒకచోట
ఆరని తడిగా ఒకచోట
మెల్లగ సాగుచు ఒకచోట
వెల్లువ యగుచూ ఒకచోట

తిన్నగ ఉరుకుచు ఒకచోట
సన్నని గొందుల ఒకచోట
వెచ్చని ఊటగ ఒకచోట
పచ్చని నదిగా ఒకచోట

చీకటి గుహలో ఒకచోట
వెలుతురు బయలున ఒకచోట
అందని ఎత్తున ఒకచోట
క్రిందకు దుముకుచు ఒకచోట

ఉడుకుచు కుతకుత ఒకచోట
బుడబుడ పొంగుచు ఒకచోట
పరుగులు దీయుచు ఒకచోట
నిలకడగాను ఒకచోట

ఎల్లెడనుండే జలమును నేను
ఎల్లరు కోరే జలమును నేను

వానగ వచ్చి వరదగ పొంగి
పట్టగ లేని ఉరవడి తోడ
చెట్టుల రాల్చి గట్టుల ద్రుంచి
ఇళ్ళను గూల్చి ఊళ్ళను ముంచి
అల్లరి జేసి ఆరటి నిచ్చి
ఇష్టము వచ్చిన రీతిని యంతా
విహరణ జేసే జలమును నేను

అందరు కోరే జలమును నేను
ఎల్లెడనుండే జలమును నేను


ఎవరో సుప్రభ అనే ఆవిడ వ్రాసిన ఈ అద్భుత కవిత చూడండి. ఎక్కడో నెట్లో వెతుకుతుంటే కనపడింది. చాలా బావుంది. నీటి గురించి చాల చక్కగా వివరించారు. ఆవిడ మృదు మధుర కవితా ధోరణికి నమఃస్సుమాంజలి.

Sunday, January 21, 2007

తెలంగాణపై సత్యసాయిబాబా - కేసీఆర్

తెలంగాణపై సత్యసాయిబాబా చేసిన వ్యాఖ్యలపై తెరాస అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యలు, నేతకార్మికుల ఆకలి కేకలు బాబాకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. ధర్మప్రచారం చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే బాబాలు, జీయర్‌స్వాములకు రాజకీయాలెందుకని వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పల్లెబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం వరంగల్ వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''వారికి కావాల్సినంత పనుంది, లక్షల మంది భక్తులున్నారు. వారి ధర్మ ప్రచార కార్యక్రమాలు చూసుకోక ఇలాంటి వాటిల్లో జోక్యం చేసుకోవటం ఎందుకు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ధర్మ ప్రచారం చేసుకునే వీరు అధర్మ ప్రచారానికి ఎలా వత్తాసు పలుకుతారు. కావాలంటే ఓ యజ్ఞం ఎక్కువగా చేసుకోవాలని గతంలోనే జీయర్‌స్వామికి సూచించాను. అయినా..! తెలంగాణ కావాలని కోరుతున్న తెలంగాణ న్యాయవాదులు, వైద్యులు, ప్రొఫెసర్లు పిచ్చివాళ్లా? వారి మాటకు ఎందుకు విలువ ఇవ్వరు. వీరి డిమాండ్ కాదని బాబాలు, స్వాములను ముందుకు తెచ్చి మాట్లాడించటం సరికాదు'' అని వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మికానికి పరిమితమైతే మంచిది ప్రత్యేక తెలంగాణ గురించి సాయిబాబా మాట్లాడకపోవడమే మంచిది. నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యను ఆయన పరిశీలించి ఉంటే ప్రత్యేక తెలంగాణ అవసరంలేదని అని ఉండేవారు కాదు. ఇలాంటి బాబాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితమైతే మంచిది. - వరంగల్‌లో విలేకరులతో మధుయాష్కీ సత్యసాయిపై 'ధూంధాం' కన్నెర్ర జడ్చర్ల, న్యూస్‌టుడే: ప్రత్యేక తెలంగాణకు సంబంధించి ఆదివారం చెన్నైలో సత్యసాయి బాబా చేసిన వ్యాఖ్యలపై మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆదివారం తెలంగాణ ధూంధాం కార్యక్రమం మండిపడింది. నేతలు నిరసన వ్యక్తం చేశారు. కవులు, కళాకారులు పాటలు పాడి సత్యసాయి వ్యాఖ్యలను గర్హించారు. మాయలు మంత్రాలతో ఇంతకాలం ప్రజలను మోసం చేసిన బాబా అదే విద్యతో తెలంగాణను మోసం చేయాలని చూస్తే సహించేదిలేదని గద్దర్ తీవ్ర స్వరంతో అన్నారు.తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విశ్వదాభిరామ వినవె వయ్యారి

మా ఆవిడ నా గోళ్ళు పెరిగిపోయినాయి అని నిన్న శనివారం నాడు వాల్ మార్ట్ లో కొన్న గోళ్ళ కత్తెరుచ్చుకుని నా వెంబడి పడింది...అప్పుడు జనించిన ఊహ ఈ పద్య రూపం సంతరించుకుంది...

గోళ్ళు పెంచుకొనిన గోకుట సులభంబు
దురద పుట్టునపుడు కరము సుఖము
పిరికివారు గోళ్ళు పీకించుకుందురు
విశ్వదాభిరామ వినవె వయ్యారి జాణ

గరిటెకాడ - పద్య రూపం

గరిటెకాడ కూర కరకరగ వేగించు
ప్రతిపనికి అడ్డుచెప్పు మొగుడి నెత్తి మొట్టవచ్చు
వంటకాకముందు ఇంటికొచ్చు మొగని కొట్టవచ్చు
విశ్వదాభిరామ వినవె వయ్యారి


అంటే మా ఆవిడ చేతిలో గరిటెకాడ ఎప్పుడూ ఉంటుంది అని కాదు...తప్పుగా అర్ధం చేసుకునేరు

అన్నమయ్య వారి ద్విపద

అన్నమయ్య వారి ద్విపద ఎంత మధురంగా ఉందో చూడండి


అరవిందభవ సపర్యాప్త గోవింద
చరణారవిందనిష్యంద మరంద
వారిధారాకార వరవారిపూర
పూరితగంభీరభూరినిర్ఘోష
రంగదభంగసంభ్రమ భరోత్తుంగ
గంగాతరంగవైఖరులు దీపింప

Thursday, January 11, 2007

ఆర్కుట్ పేరుకి అర్ధం

ఆర్కుట్ పేరుకి అర్ధం టర్కిష్ భాషలో సంతోషము, సుఖము, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము, అదృష్టము, యోగము కలగలిసిన నగరము అని అర్ధము అట. ఆర్కుట్ తయారు చేసిన ఆయన టర్కీ దేశస్థుడు - ఆయన పేరు ఆర్కుట్ బుయుక్కోక్టెన్

ఒక పద్య పద విన్యాసం - పాల్కురికి సోమన

పాల్కురికి సోమన వారి వృషాధిప శతకములోని ఒక పద్య పద విన్యాసం చూడండి..అద్భుతం

తజ్ఞ! జితప్రతిజ్ఞ! యుచిత ప్రమథానుగతజ్ఞ! నమ్ర దై
వజ్ఞ! కళావిధిజ్ఞ! బలవచ్ఛివభక్తి మనోజ్ఞ! ధూతశా
స్త్రజ్ఞ! సువాదపూరిత రసజ్ఞ! తృణీకృత పంచయజ్ఞ! స
ర్వజ్ఞ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!

Wednesday, January 10, 2007

చంఘీజ్ ఖాన్ అసలు పేరు

జగమెరిగిన యోధుడు చంఘీజ్ ఖాన్ అసలు పేరు ఏమిటో తెలుసా ? సూటూ బోడ్గా బట్ టెంగ్రీ టెమూజిన్ ఖాఖాన్... ఇందులో "టెమూజిన్" అంటే అరచేతిలో ఉబ్బెత్తుగా ఉన్న మాంసపు ముద్ద. అలా ఉన్నందుకే అతను జగజ్జేతగా మారాడని ప్రజలు చెప్పుకుంటారు

Sunday, January 07, 2007

"గాలిబ్‌" - దాశరథి అనువాద గీతాలు

మబ్బువచ్చి నాదు మడిని పండింపగా
మెరపువచ్చి దాని మ్రింగజొచ్చె.

"గాలిబ్‌" - దాశరథి అనువాద గీతాలు

సింధువునుజేరి బిందువు సింధువగును
ధ్యేయమునుబట్టి ప్రతిపని దివ్యమగును.

"గాలిబ్‌" - దాశరథి అనువాద గీతాలు

హరిని ప్రార్థింప తలవంచినట్లుగానె
బాగ త్రాగి మ్రొక్కుము మధుభాండమునకు.

Wednesday, January 03, 2007

వంద టపాలు పూర్తి

ఈ హా ...నా బ్లాగులో వంద టపాలు పూర్తి అయినాయి అని ఇప్పుడే చూసుకున్నా...మొత్తానికి నూతన సంవత్సరంలో ఒకటి సాధించాను అన్న మాట

గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ

Taken from EENADU article by Sri Chikolu Sundarayya

గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ
1966 డిసెంబరు ఏడో తేదీ
హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక
2 power 103 ఎంత?
సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని

'క' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, 'స, రి, గ, మ, ప, ద, ని'' అక్షరాల లబ్దం ఎంత?
ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు...

కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా... కాదు.

పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన వారా... కాదు. పుట్టుగుడ్డి! పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది.

ఆయనే గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!

శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా... మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది... ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ అందరూ తలలు పట్టుకుంటారు! దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం... ''ఒక కోటి 84 లక్షల, 46 వేల 74 కోట్ల 40 లక్షల, 73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట... (1,84,46,74,40,73,70,95,51,615!)

ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే... అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి రెండింతలు! అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు!

ఇదంతా అబ్బురమనిపించవచ్చు. కానీ సంజీవరాయశర్మ గణితావధాన మహిమ అదంతా!

సంజీవరాయశర్మ 1907 నవంబరు నెల 22న కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకాలోని కల్లూరు జిల్లాలో జన్మించారు. జననీ జనకులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు. జన్మతః అంధుడు కావడంతో పురుడు పోసిన మహిళ గొంతు నులిమి దిబ్బలో పాతెయ్యమంది. కొందరు బంధువులు నోట్లో వడ్ల గింజ వేశారు. అయినా ఆయన్ని మరణం ఏమీ చేయలేకపోయింది. అప్పట్లో బ్రెయిలీ లిపి లేదు. పోనీ అంధుల్ని చేరదీసే వ్యవస్థా లేదు. శర్మ అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవే ఆయన విన్నారు. తల్లిదండ్రులు... ఇతరులు చెప్పే మాటలు, చేసే చిన్నలెక్కలు విన్నారు. ఒకటి, రెండు, మూడు.... ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు! సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షిత్రాలు, వారాలు, పక్షాలు... గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి పెంచారు. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతోన్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితులై నేర్చుకొన్నారు.

సంజీవరాయశర్మ తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించారు. అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోను పలు ప్రదర్శనలిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబరు 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ సంజీవరాయశర్మ గణితావధానమే! ఆయన పొందిన సన్మానాలు, ప్రదర్శనలు ఒక పుస్తకం అంత ఉన్నాయి. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం!

అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్లా కీర్తించారు. శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలు గ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు. అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేదావి ఇల్లు కదలలేకపోయారు. వివిధ విశ్వవిద్యాలయాలు... ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. చిత్రమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.

ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు మంచి శిక్షణ పొందారు. కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే... ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు శర్మ.

ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ''ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం'' అని శర్మనుద్దేశించి అన్నారు. శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయశర్మని రక్షించుకోలేకపోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయశర్మ అస్తమించారు. 'అంక విద్యాసాగర' విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వరస్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు! ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు... ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో!

పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి !

(...) గారు - పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి అంటూ - వాడిపోయిన తొక్కల లాంటి మాటలు మాట్లడటానికి ప్రసిద్ధి అని మొత్తానికి మళ్ళీ నిరూపణ అయ్యింది. "కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉన్నా , మరొకటున్నా రామాలయం నిర్మాణం పై ప్రభావం ఉండదు అట. ఎట్టి పరిస్థితిలోనూ ప్రాణాలు అర్పించి అయినా రామాలయం నిర్మిస్తాడు అట.". హ.హ.హ ప్రతి వాడికి అవసరం ఉన్నా లేకపోయినా ప్రాణాలు అర్పించటం అనేది ఒక ప్రహసనం గా మారిపోయింది. ఎలాగూ వాళ్ళంతట వాళ్ళు ప్రాణాలు అర్పించరు, అర్పించలేరు కాబట్టి, ఈ దరిద్రులకి వోట్లేసిన జనాలలోంచి ఒకడు వెళ్ళి కసుక్కున ఒక్క పోటు పొడిచి పారెస్తే గోల వదిలిపోతుంది. పైగా అయోధ్య హింసా కాండ జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే గూబ గుయ్యి మనేలా ఒక్కటిచ్చుకోవాలి అని అనిపిస్తుంది. జనాలు మరీ పిచ్చి మున్..కొ..లాగా కనిపిస్తున్నారు ఏమో (...) గారికి..వీరి తొక్కలో తోక ఎవరన్నా మొదలంటా కత్తిరించండి బాబూ...ఇలాంటి వార్తలు వినలేక చస్తున్నాము..

రామా - నీల మేఘ శ్యామా - ఒక్క సారి నీ ధనస్సు తీసి, విరిగిపోయిన ఆ శివ ధనుస్సు అయినా సరే , ఆ ముక్కతో ఈలాంటి దిక్కుమాలిన దరిద్రులకి దిక్కు చూపిస్తూ దయచేసి దిక్కులు దద్దరిల్లేలా ఒక్కటిచ్చుకో

Tuesday, January 02, 2007

బైరాగిగారి అద్భుతమయిన కవితా ముత్యం

ఆలూరి బైరాగిగారి కలం నుంచి జాలువారిన ఒక అద్భుతమయిన కవితా ముత్యం ఇక్కడ చూడండి

కవితా ముత్యం


తెలంగాణా తల్లి - తెలుగు తల్లి

ఈ కే సీ ఆర్ మాటలు వింటూ ఉంటే ఎడ్వాలో నవ్వాలో తెలీడం లేదు. "తెలంగాణా తల్లి - తెలుగు తల్లి కంటే సీనియర్ అట. తెలుగు తల్లిని కుట్రపూరితంగా తెర పైకి తెచ్చారు అట.కిరీటం ఉండాలి అట, హిందు / ముస్లిం / కిరస్తానీ వాళ్ళు అంతా పూజించేటట్టు ఉండాలి అంట. ఈ విగ్రహాలు తయారు చేసి ఊరూరా ప్రతిష్టించాలి అట"

అర్ధం పర్ధం లేని ఈ పిచ్చి వాగుడు ఎంటిరా నాయనో - ఓరి నాయనో -ఈ రాజకీయ జంబూకానికి మతి భ్రమణం అన్నా కలిగి ఉండాలి , లేక పిచ్చి కుక్క అన్నా కరిచి ఉండాలి....ఏకంగా ఒక రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసి , అందులో ఒక ముక్కకి ముఖ్యమంత్రి అయిపోదాము అని ఎంత ఆశరా మగడా... ఎడ్డి గొర్రెల మంద జనాలు , మందు - డబ్బు - క్రికెట్ బాటు పంచిపెట్టగానే - ఓట్లేసి గెలిపించారు...ఇక అడ్డూ ఆపూ లేదు మాటలకి...ఎప్పుడు బాగు పడతారురా నాయనా...

Monday, January 01, 2007

వాఙ్గ్మయం , సారస్వతం , సాహిత్యం

వాఙ్గ్మయం అంటే మాటల కూడిక అని అర్ధం అని, సారస్వతం అంటే అర్ధమైన రసంతో కూడుకుని ఉన్నది అని, సాహిత్యం అంటే హితంతో కూడుకుని ఉన్నది అని ఇప్పుడే తెలిసింది

సిగరెట్

సిగరెట్ ఒక స్థూపాకార వస్తువు. దానికి ఒక చివర నిప్పు, మరొక చివర మూర్ఖుడు ఉంటారు ...

పరీక్ష - ఎవరు ఎవరికి ?

బంగారానికి పరీక్ష అగ్ని
స్త్రీకి పరీక్ష బంగారం
పురుషుడికి పరీక్ష స్త్రీ